Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nitish Kumar Reddy: సన్‌రైజర్స్‌లో మరో శంకరన్న.!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వైఫల్యం కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో నితిష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను విసిగించాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఆడిన నితీష్ రెడ్డి.. ఒకే ఒక్క ఫోర్‌తో 19 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై పరుగులు చేసేందుకు నితీష్ రెడ్డి తెగ ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలకు బదులివ్వలేకపోయాడు. ఇన్నోవేటివ్ షాట్స్ ఆడటంలో ఇబ్బంది పడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ఈ సీజన్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్న నితీష్ కుమార్ రెడ్డి.. 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 30, 32, 0, 19, 31, 19 లతో మొత్తం 131 పరుగులే చేశాడు. యావరేజ్ 21.83 మాత్రమే ఉండగా.. స్ట్రైక్‌రేట్ 113.91 కావడం గమనార్హం. గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి తాజా సీజన్‌లో మాత్రం తేలిపోతున్నాడు.

Nitish Kumar Reddy brutally trolled after his slow knock against MI in IPL 2025

నితీష్ ప్రదర్శనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్ ప్రదర్శన ఆధారంగా నితీష్‌ను జట్టులో కొనసాగించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అతను జట్టుకు భారంగా మారాడని విమర్శిస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న నితీష్‌కు టాప్-4లో ఆడే అవకాశం కల్పించినా.. అతను రాణించలేకపోతున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి.. మరో విజయ్ శంకర్‌లా తయారయ్యాడని ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో సన్‌రైజర్స్‌కే ఆడిన విజయ్ శంకర్ కూడా ఇలానే జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించేవాడని, ఇప్పుడు నితీష్ బ్యాటింగ్ చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఇతర బ్యాటర్ల వైఫల్యం కారణంగా ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్.. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఇంకా ఆరెంజ్ ఆర్మీ 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇందులో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. మెరుగైన రన్‌రేట్‌తో కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి.

Story first published: Friday, April 18, 2025, 10:06 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+