Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nicholas Pooran స్టన్నింగ్ క్యాచ్.. జాంటీ రోడ్స్ శిష్యుడా మజాకా!(వీడియో)

Nicholas Pooran Takes A Special Diving Catch To Dismiss Krunal Pandya

చెన్నై: పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరోసారి తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో పూరన్ సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనదైన డైవ్ క్యాచ్‌తో ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ శిష్యుడనిపించుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు ముంబై బ్యాట్స్‌మన్ కృనాల్ పాండ్యా నిరాశగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్లోయర్ బాల్‌ను కృనాల్ స్వీపర్ కవర్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ పరుగెత్తుకుంటు వచ్చి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. బంతిపైనే దృష్టిపెట్టిన అతను అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. గత సీజన్‌లో బౌండరీ లైన్ వద్ద గాల్లో అతను చేసిన విన్యాసం క్రికెట్ చరిత్రలోనే బెస్ట్‌గా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ బౌలర్లకు మెరుపు ఫీల్డింగ్ తోడవడంతో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో షమీ, రవికి తోడుగా.. దీపక్ హుడా, అర్ష‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

Story first published: Friday, April 23, 2021, 22:30 [IST]
Other articles published on Apr 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+