న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సిరీస్ విజయంతోనే పూరన్‌కు తల పొగరు నెత్తికెక్కిందని మండిపడుతున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.
ఈ విజయాన్ని నెత్తికెక్కించుకున్న నికోలస్ పూరన్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టును, ఆటగాళ్లను ఎగతాళి చేశాడు. సహచర ఆటగాడు అకీల్ హొస్సెన్‌తో కలిసి ఇన్‌స్టాలో ఒక రీల్ చేసిన పూరన్.. టీమిండియా ఓటమిని ఉద్దేశించి నోరు మూసుకోవాలని సైగ చేయగా.. పక్కనే ఉన్న హొస్సెన్ ఉఫ్ అని ఊదేసాడు. పైగా ఈ వీడియోకు'మీరు ఏం అనుకుంటే అదే'అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇది భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ఇద్దరి ఎకసెక్కాలను టీమిండియా ఆటగాళ్లు మనసులో పెట్టుకుంటారని, సమయం వచ్చినప్పుడు బదులిస్తారని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇలానే విరాట్ కోహ్లీని ఇలానే విండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఎగతాళి చేసాడు. దీన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ భారత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను ఊచకోత కోసి.. అతని ఎగతాళి గుర్తు చేస్తూ మరి సంబరాలు చేసుకున్నాడు.
నికోలస్ పూరన్, అకీల్ హెస్సెన్‌కు ఇదే ట్రీమ్‌మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇక ఐపీఎల్ పేరిట భారత్‌కు వచ్చి కోట్ల రూపాయలు ఆర్జించే పూరన్‌కు ఆ విశ్వాసం కూడా లేకపోవడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'తప్పురా.. తిండి పెట్టిన దేశంపై ఎకసెక్కాలా?'అని సెటైర్లు పేల్చుతున్నారు.
అయితే నికోలస్ పూరన్‌ను హార్దిక్ పాండ్యానే రెచ్చగొట్టాడు. మూడో టీ20 విజయానంతరం పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌పై మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడు. 'నిక్కీ నా బౌలింగ్‌ను టార్గెట్ చేస్తాడేమో.. మరేం పర్లేదు. నాకు ఇలాంటివి ఇష్టమే. అతను నా మాటు విన్ని నన్ను టార్గెట్ చేసినా.. ఔటయ్యేది నా బౌలింగ్‌లోనే'అని హార్దిక్ సవాల్ విసిరాడు. చివరి టీ20లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో నికోలస్ పూరన్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా కామెంట్స్.. అతని సిక్స్‌ల వీడియోను ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేశాడు.