మా వైఫల్యానికి కారణం అదే.. క్షమించండి అందర్నీ బాధపెట్టాం: నికోలస్ పూరన్

జీలాంగ్: యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా వెస్టిండీస్ క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ 2022 నుంచి తప్పుకుంది. రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. పేలవ ఆటతీరుతో క్వాలిఫయర్స్‌లోనే ఇంటి ముఖం పట్టింది. శుక్రవారం పసికూన ఐర్లాండ్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలోని వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో సూపర్ 12కు అర్హత సాధించకుండానే తమ పోరాటాన్ని ముగించింది. క్వాలిఫయర్స్‌లో గ్రూప్ బిలో స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్‌తో పోటీపడిన వెస్టిండీస్.. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే నమోదు చేసి ఇంటిదారి పట్టింది. స్కాంట్లాండ్‌తో ఓడిన వెస్టిండీస్.. జింబాబ్వేపై గెలిచింది. కానీ ఐర్లాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.

చెత్త బ్యాటింగే మా కొంపముంచింది..
ఇక బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కెప్టెన్ నికోలస్ పూరన్ తెలిపాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై 145 పరుగులు ఏ మాత్రం సరిపోవన్నాడు. తమ ప్రత్యర్థి ఐర్లాండ్ అద్భుతంగా ఆడిందని కొనియాడిన పూరన్.. ఈ పరాజయం తమ జట్టుకు ఓ గుణపాఠమని చెప్పుకొచ్చాడు. 'ఈ ఓటమి జీర్ణించుకోలేనిది. ఈ టోర్నీలో మా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు. బ్యాటింగ్ వికెట్‌పై 145 పరుగులు చేయడం సబబు కాదు. ఈ లక్ష్యాన్ని కాపాడటం బౌలర్ల శక్తికి మించిన పని. ఈ పరాజయం మా జట్టుకు ఓ సవాల్ వంటిది. విజయం సాధించిన ఐర్లాండ్‌కు అభినందనలు. ఆ జట్టు అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇరగదీసింది.

అందర్నీ బాధపెట్టాం..
ఈ ఓటమితో టోర్నీ నుంచి తప్పుకున్నా.. జట్టు పరంగా కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. ముఖ్యంగా జాసన్ పుంజుకొని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్రాండన్ కింగ్ బ్యాటింగ్‌లో రాణించాడు. జోసెఫ్ బ్యాట్, బాల్‌తో మెరిసాడు. ఈ ఓటమి మా జట్టుకు ఓ గుణపాఠం. మేం మా ఆటతీరుతో అభిమానులను, మా అంతరాత్మలను తీవ్రంగా నిరాశపరిచాం. ఇది నిజంగా బాధపెట్టే పరాజయమే. మా ఆటగాళ్లు, నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నాను'అని నికోలస్ పూరన్ తన బాధను వెళ్లగక్కాడు.

బ్రాండన్ కింగ్ ఒంటరి పోరాటం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలనీ మూడు వికెట్లు తీయగా.. సిమీ సింగ్, బారీ మెక్‌కార్తీ తలో వికెట్ పడగొట్టారు.

పాల్ స్టిర్లింగ్ అజేయ హాఫ్ సెంచరీ...
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. లోర్కాన్ టకర్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(37) కూడా పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోస్సెన్ ఒక్కడే ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications