Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా ఓటమికి అదే కారణం: నికోలస్ పూరన్

Nicholas Pooran Reveals The Reason Behind West Indies Loss in 2nd ODI against India

పోర్ట్ఆఫ్ స్పెయిన్: అంతగా అనుభవం లేమి ఆటగాళ్లు జట్టులో ఉండటంతో పాటు వర్షం విసిరిన సవాల్‌ను ఎదుర్కొనలేక ఓటమి పాలయ్యామని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అన్నాడు. భారత్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో విండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 119 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నికోలస్ పూరన్.. ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోవడం తమ ఓటమికి కారణమైందన్నాడు. వర్షం విసిరిన డకవర్త్ లూయిస్ సవాల్‌ను స్వీకరించలేకపోయామని తెలిపాడు. అయితే తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించినప్పటికీ విజయాన్నందుకోలేకపోయామని, ఆ మ్యాచ్‌లు అందించిన ఆత్మవిశ్వాసంతో తదుపరి సిరీస్‌ల్లో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ప్రణాళికల తగ్గట్లు బ్యాటింగ్ చేయలేక...

ప్రణాళికల తగ్గట్లు బ్యాటింగ్ చేయలేక...

'ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా రాణించాం. మా సాయశక్తులా ఆడాం. మా ప్లేయర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబర్చారు. కానీ చాలా మ్యాచ్‌లను మేం తృటిలో కోల్పోయాం. డక్‌వర్త్ లూయిస్ ఆటలో భాగమైతే అది బ్యాటింగ్‌ విభాగానికి సవాల్‌‌లాంటిది. ఈ మ్యాచ్‌లో మేం భాగస్వామ్యాలు నెలకొల్పాం. కానీ మేం అనుకున్న రితీలో మా బ్యాటింగ్ కొనసాగలేదు. అది మా ఓటమికి కారణమైంది.‌

టీ20 సిరీస్‌లో సత్తా చాటుతాం..

టీ20 సిరీస్‌లో సత్తా చాటుతాం..

జట్టులో కొంత మంది అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. వన్డే క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్‌తో అప్ కమింగ్ వన్డే సిరీస్‌లో సత్తా చాటుతాం. ఈ సిరీస్‌లో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. పవర్ ప్లేలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాకపోతే వికెట్లు తీయలేకపోయారు. ప్రతీ మ్యాచ్‌కు మా ఆటగాళ్లకు రెట్టించిన ఉత్సహాన్ని అందుకున్నారు. మా టీ20 జట్టు పట్ల ఉత్సహంగా ఉన్నా. భారత్‌తో టీ20 సిరీస్‌లో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాం.'అని పూరన్ చెప్పుకొచ్చాడు.

పాపం శుభ్‌మన్ గిల్

పాపం శుభ్‌మన్ గిల్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ ( 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 98 నాటౌట్)సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది. 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ కింగ్‌ (42), నికోలస్‌ పూరన్‌( 42), హోప్‌(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్‌ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణా చెరో వికెట్‌ పడగొట్టారు.

Story first published: Thursday, July 28, 2022, 11:40 [IST]
Other articles published on Jul 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+