Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నికోలస్ పూరన్ ఊచకోత.. 9 సిక్స్‌లతో గేల్ ప్రపంచ రికార్డ్ బద్దలు!

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ జోరు కొనసాగుతోంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన పూరన్.. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లోనూ అదే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్(టీకేఆర్)కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేసి టీకేఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్న నికోలస్ పూరన్.. ప్రత్యర్థి బౌలర్లను మాత్రం ఓ ఆట ఆడుకున్నాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

Nicholas Pooran overtakes Chris Gayle World record with CPL half-century

టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నికోలస్ పూరన్ నిలిచాడు. ఈ ఏడాది ఇప్పిటి వరకు పూరన్ 139 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లోనే అతను 9 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్(135) సిక్స్‌లను అధిగమించాడు. 2015లో క్రిస్ గేల్ 135 సిక్స్‌లు బాదాడు. 2012, 2011, 2016, 2017ల్లో కూడా క్రిస్ గేల్ 121, 116, 112, 101 సిక్స్‌లు బాదాడు. ఈ రికార్డులన్నింటినీ పూరన్ అధిగమించాడు.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 250 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌కు తోడుగా కీస్ కార్టీ(35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సెయింట్ కిట్స్ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు తీయగా.. ర్యాన్ జాన్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసి ఓటమిపాలైంది. మైకేల్ లూయిస్(38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), ట్రిస్టన్ స్టబ్స్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ట్రిన్‌బాగ్ నైట్‌రైడర్స్ బౌలర్లలో జోష్ లిటిల్, సునీల్ నరైన్, వాకర్ సలామ్ రెండేసి వికెట్లు తీయగా.. నాథన్ ఎడ్వర్డ్, టెర్రాన్స్ హిండ్స్ తలో వికెట్ తీసారు.

నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా అతనికి ప్రమోషన్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Sunday, September 1, 2024, 13:15 [IST]
Other articles published on Sep 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+