For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 
RCB vs LSG: నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. స్టేడియం బయట పడ్డ బంతి!

ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పూరన్ భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన 106 మీటర్ల సిక్సర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ప్రస్తుతం ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆర్‌సీబీ బౌలర్ రీస్ టోప్లీ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ నాలుగో బంతిని రీస్ టోప్లీ ఫుల్‌టాస్‌గా వేయగా.. పూరన్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అతని ధాటికి బంతి స్టేడియం బయట 106 మీటర్ల దూరంలో పడింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్ కావడం విశేషం.

Nicholas Pooran hits the longest six of IPL 2024 as he sends the ball Out The Park vs RCB

ఈ మ్యాచ్‌లో పూరన్ 21 బంతుల్లో 5 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అనూజ్ రావత్ వదిలేసాడు. ఈ అవకాశంతో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నో సూపర్ జెయింట్స్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ఆర్‌సీబీ బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా..టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీసారు. ఆర్‌సీబీ బౌలర్ల పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసొచ్చింది.

Story first published: Tuesday, April 2, 2024, 23:00 [IST]
Other articles published on Apr 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+