కావ్య పాపకు బిగ్ షాక్.. MI చేతిలో సన్‌రైజర్స్‌కు ఘోర పరాజయం!
ది హండ్రెడ్ లీగ్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. మంగళవారం ఎంఐ లండన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎంఐ లండన్ బ్యాటర్లు నికోలస్ పూరన్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58), సామ్ కరన్(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగి సన్‌రైజర్స్ లీడ్స్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), టామ్ అల్సోప్(18 బంతుల్లో 3 సిక్సర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హ్యారీ బ్రూక్(3), కెప్టెన్ జాక్ క్రాలీ(13) తీవ్రంగా నిరాశపర్చారు. ఎంఐ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 19 బంతుల్లో 4 వికెట్లు తీయగా.. సామ్ కరణ్ 15 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, టామ్ కరన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఎంఐ లండన్ 84 బంతుల్లో 3 వికెట్లకు 144 పరుగులు చేసి గెలుపొందింది. ఎంఐ ఓపెనర్లు విల్ జాక్స్(2), జేమ్స్ విన్స్(17) విఫలమైనా.. సామ్ కరణ్, నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 20 బంతుల్లో 2 వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ హాజరయ్యాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ లండన్ టీమ్‌కు మద్దతు తెలిపాడు. టీమ్ ఓనర్ నీతా అంబానితో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తీవ్రంగా నిరాశపర్చాడు. 10 బంతులేసి 30 పరుగులిచ్చుకున్నాడు. వేలంలో కావ్య మారన్ ఈ పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అతను మాత్రం జట్టును నట్టేట ముంచేసాడు.
టీ20 క్రికెట్‌కు భిన్నంగా ది హండ్రెడ్ లీగ్ ఉంటుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు 100 బంతుల చొప్పున ఆడుతాయి. ఒక ఓవర్‌లో బౌలర్ ఐదు బంతులే వేస్తాడు. ప్రతీ బౌలర్ గరిష్టంగా 20 బంతులే వేయాలి. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు వేసే బంతులనే లెక్కిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

