Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. టీ20ల్లో నయా వరల్డ్ రికార్డ్!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్(టీకేఆర్)కు ప్రాతినిథ్యం వహిస్తున్న పూరన్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సిక్సర్ల మోత మోగిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

7 మ్యాచ్‌ల్లో 275 పరుగులతో ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ జట్టుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు.

Nicholas Pooran Creates History with massive world record in T20 cricket

ఈ మ్యాచ్‌లో ఏడు సిక్స్‌లు బాదిన నికోలస్ పూరన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక క్యాలండర్ ఇయర్‌లో 150 సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఏడాది పూరన్ 63 ఇన్నింగ్స్‌లు ఆడి ఇప్పటికే 151 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో పూరన్ తర్వాత క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 2015లో 36 ఇన్నింగ్స్‌ల్లో 135, 2012లో 38 ఇన్నింగ్స్‌ల్లో 121 సిక్స్‌లు కొట్టాడు.

టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా పూరన్ నిలిచాడు. ఈ ఏడాది 64 ఇన్నింగ్స్‌ల్లో పూరన్ 2022 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను అలెక్స్ హేల్స్ రికార్డును అధిగమించాడు. హేల్స్ 2022లో 61 ఇన్నింగ్స్‌ల్లో 1946 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

అతను 2021లో 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 పరుగులు చేశాడు. మరో 15 పరుగులు చేస్తే రిజ్వాన్ రికార్డును కూడా పూరన్ అధిగమించనున్నాడు. నికోలస్ పూరన్.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో అతనికి అప్‌కమింగ్ సీజన్‌లో సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. పూరన్ జోరును చూసి ఆ జట్టు అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Tuesday, September 24, 2024, 9:30 [IST]
Other articles published on Sep 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+