వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పురుషుల 'ది హండ్రెడ్' లీగ్‌లో నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. అతను సిక్స్ ధాటికి బంతి ఏకంగా మైదానం బయట పడింది. దాదాపు 113 మీటర్లు దూరం వెళ్లింది. ప్రస్తుతం ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ లీగ్‌లో నార్త్‌రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ 33 బంతులలో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మాంచెస్టర్ ఒరిజినల్ వేసిన 74వ బంతిని పూరన్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ తరలించాడు. లెగ్ స్టంప్ దిశగా పడిన ఈ బంతిని పూరన్ ఫ్లిక్ షాట్‌తో మైదానం బయటపడేయడం విశేషం. ఈ వీడియో ది హండ్రెడ్ లీగ్ ప్రతినిథులు సోషల్ మీడియా వేదికగా 'వావ్'అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మిచెల్ సాంట్నర్(3/24) మూడు వికెట్లు తీయగా.. పాట్ బ్రౌన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన నార్థెర్న్ సూపర్‌ఛార్జర్స్ 97 బంతుల్లో 3 వికెట్లకు 156 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌తో పాటు హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) సత్తా చాటాడు. ఫజలక్ ఫరూకీ, ఉసామా మిర్, స్కాట్ కర్రీ తలో వికెట్ తీసారు.