జెమీసన్ కీలు బొమ్మ..
అయితే భారత అభిమానుల ఆగ్రహానికి కారణం ఉండొచ్చు. కానీ, న్యూజిలాండ్ ప్రముఖ వెబ్ సైట్.. విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. TheAccNZ అనే ఆ వెబ్‌సైట్ పెట్టిన ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫొటో విరాట్ కోహ్లీని అత్యంత దారుణంగా అవమానించేలా ఉంది. ఇంతకీ అందులో ఏం ఉందంటే. ఒక మహిళ.. బెల్ట్‌తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్‌గా పోల్చిన సదరు వెబ్‌సైట్.. ఆ మనిషిని విరాట్ కోహ్లీతో పోల్చింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడని, అతని చేతిలో కీలు బోమ్మ అయ్యాడనే అర్థంలో ఆ వెబ్‌సైట్ ఈ పోస్ట్ పెట్టింది.

మంచివాళ్లనుకుంటే..
అయితే, ఈ పోస్ట్ పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఇలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. ఈ ఫోటో భారత్‌లో వైరల్ అయితే.. సదరు వెబ్ సైట్ నామారూపాలు లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి కొందరు అయితే.. న్యూజిలాండ్ గ్రౌండ్ లోపల..బయటా చాలా మర్యాదగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ చర్యతో వాళ్ల ప్రతిష్టను దిగజార్చుకున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్ అయితే.. కైల్ జెమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు.

ప్చ్.. ఒక్క ఐసీసీ టైటిల్ లేదు..
మరోవైపు, టీమిండియాకు ఐసీసీ ఈవెంట్లు కలిసి రావడం లేదు.2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు ఇంత వరకు మరో ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో ఏడు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని మరి ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లేఆఫ్స్, నాకౌట్ దశకు సులభంగానే చేరుకుంటున్న టీమిండియాకు చివరి మొట్టుపై బోల్త పడటం అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత ఇది మరి ఎక్కువైంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. అందుకే కోహ్లీకి కెప్టెన్‌గా ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications












