Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand vs West Indies: కేన్ మామ డబుల్.. విండీస్ ట్రబుల్!

 New Zealand vs West Indies: Kane Williamsons double consolidates NZs advantage

హామిల్టన్‌: కేన్ విలియమ్సన్(240 బ్యాటింగ్) డబుల్ సెంచరీకి టామ్ లాథమ్(86) హాఫ్ సెంచరీ తోడవ్వడంతో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఆట టీబ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 477 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌తో పాటు కైల్ జెమీసన్(47 బ్యాటింగ్)క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో కీమర్‌ రోచ్‌ , గాబ్రియెల్‌ మూడేసి వికెట్లు తీశారు.

వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 78 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్‌పై టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆ టీమ్ బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. కివీస్ ఓపెనర్, అరంగేట్ర ప్లేయర్ విల్ యంగ్(5)ను నాలుగో ఓవర్‌లో ఔట్ చేసిన విండీస్ బౌలర్లు.. రెండో వికెట్ కోసం మరో 52 ఓవర్లు తీసుకున్నారు.

విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న లాథమ్, విలియమ్సన్ సెకండ్ వికెట్‌కు 154 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. సెంచరీ చేసేలా కనిపించిన లాథమ్‌ను రోచ్ బౌల్ట్ చేయగా..ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, విలియమ్సన్‌తో కలిసి జాగ్రత్తగా ఆడి ఫస్ట్ డే ఆటను ముగించాడు.

ఇక, రెండో రోజు ఆట ప్రారంభంలోనే కివీస్.. టేలర్ వికెట్ కోల్పోయినా మరోవైపు విలియమ్సన్ నిలకడైన ఆటతో ఇన్నింగ్స్‌ను ముందు నడిపించాడు. వరుస విరామాల్లో హెన్రీ నికోలస్(7), టామ్ బ్లండెల్(14), మిచెల్(9) వికెట్లు కోల్పోయినా.. డబుల్ సెంచరీతో చెలరేగిన విలియమ్సన్ కైల్ జెమీసన్ సాయంతో జట్టును భారీస్కోర్‌ అందించే దిశగా తీసుకెళ్తున్నాడు. ఇక మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని జాతి వివక్ష (బ్లాక్‌ లైవ్‌ మ్యాటర్‌) ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Story first published: Friday, December 4, 2020, 9:02 [IST]
Other articles published on Dec 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+