ఒకవైపు ఉత్కంఠ మ్యాచ్.. మరోవైపు ఆకాశంలో అద్భుతం!! అభిమానులంతా..!

హామిల్టన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆదివారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్ 9 వికెట్ల తేడాతో పాక్‌పై సునాయాసంగా గెలిచింది. తొలుత పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 19.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (63 బంతుల్లో 84 నాటౌట్) కివీస్ విజయంలో కీలక పాత్ర పోచించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది.
సుందరమైన దృశ్యం
అభిమానులంతా ఆసక్తికరంగా మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆకాశంలో గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఈ సుందరమైన దృశ్యం సెడెన్ పార్క్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటు చేసుకుంది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 10వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కెమెరామన్ దీన్ని బంధించాడు. అభిమానులు అందరూ ఈ రమణీయమైన దృశ్యంను ఆసక్తికరంగా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

గ్రేట్ కంజక్షన్
భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని 'కంజక్షన్' అని అంటారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం 'గ్రేట్ కంజక్షన్' అంటారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి. ఇక సోమవారం అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. దాదాపు నాలుగు శతబ్దాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. అంతకుముందు 1623లో ఇలా జరిగింది.

తృటిలో సెంచరీ మిస్
ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (57 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. అతడు తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హఫీజ్ ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. రిజ్వాన్ మాత్రమే 22 రన్స్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' టిమ్ సౌతీ 4 వికెట్లతో చెలరేగాడు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు.

సీఫెర్ట్ హాఫ్ సెంచరీ
అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మార్టిన్ గప్టిల్ (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. టీమ్ సీఫెర్ట్, కేన్ విలియమ్సన్ (42 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు అజేయంగా 95 బంతుల్లో 124 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అష్రఫ్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.
'నాపై తప్పుడు ప్రచారం చేశారు.. రిటైర్మెంట్‌కు వారే కారణం.. అందుకే ప్రజలముందుకు వచ్చా'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications