
హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నెలకొల్పిన రికార్డ్‌కి 25 పరుగుల దూరంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో టీ20లో 11 పరుగులు చేశాడు. ఇక బుధవారం హామిల్టన్ వేదికగా జరగనున్న మూడో టీ20లో కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మహీ రికార్డును బ్రేక్ చేస్తాడు.
భారత కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ 1,112 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ 1,088 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. దీంతో మూడో టీ20లో కోహ్లీ ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 1,273 పరుగులతో అగ్ర స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1,148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత ధోనీ (1,112), విరాట్ కోహ్లీ (1,088) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన కెప్టెన్ల జాబితాలో డుప్లెసిస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్న కోహ్లి.. మరో హాఫ్ సెంచరీ సాధిస్తే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరసన చేరుతాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఎనిమిదిసార్లు యాభైకి పైగా పరుగులు సాధించాడు. మరొకవైపు అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో చేరడానికి కోహ్లికి ఇంకా ఏడు సిక్సర్లు అవసరం. ఈ ఫీట్‌ను కేవలం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రమే సాధించాడు. కోహ్లి మరో ఏడు సిక్సర్లు సాధిస్తే కెప్టెన్‌గా 50 సిక్సర్లు కొట్టిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో రెండు గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్ మూడో టీ20లోను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇక మూడో టీ20 బుధవారం హామిల్టన్ వేదికగా 12.30 గంటలకు ప్రారంభం కానుంది.