For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs ENG: న్యూజిలాండ్ పోరాటం.. ఇంగ్లండ్ అసహనం! కేన్‌ మామపైనే బ్లాక్ క్యాప్స్ ఆశలు!

 New Zealand vs England: Black Caps frustrate visitors in 2nd Test

వెల్లింగ్టన్: న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్‌ తేడాతో భారీ విజయం కన్నేసిన ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ ఊహించని షాకిచ్చింది. తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌కు చికాకు తెప్పించడంతో పాటు మ్యాచ్‌ను మరో రోజుకు పొడిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్(172 బంతుల్లో 11 ఫోర్లతో 83), డేవాన్ కాన్వే(155 బంతుల్లో 6 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

కేన్ మామపైనే ఆశలు..

కేన్ మామపైనే ఆశలు..

ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(81 బంతుల్లో 2 ఫోర్లతో 25 బ్యాటింగ్), హెన్రీ నికోల్స్(70 బంతుల్లో ఫోర్‌తో 18 నాటౌట్) ఉండగా.. న్యూజిలాండ్ 24 పరుగులు వెనుకబడి ఉంది. సోమవారం నాలుగో రోజు ఆటలో ఈ మ్యాచ్ ఫలితం డిసైడ్ అవ్వనుంది. న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచి.. అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఓటమి తప్పించుకుంటుంది. లేకుంటే మ్యాచ్ ఇంగ్లండ్ వశమవుతోంది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్‌పై జట్టు ఆధారపడి ఉంది.

టీమ్ సౌథీ ఒక్కడే..

టీమ్ సౌథీ ఒక్కడే..

అంతకుముందు 138/7 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ 209 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టీమ్ సౌథీ(49 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. దాంతో ఇంగ్లండ్‌కు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. న్యూజిలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించగా.. ఆ జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఓపెనర్లు టామ్ లాథమ్ శుభారంభం అందివ్వడంతో ధీటుగా బదులిస్తోంది. విల్ యంగ్ విఫలమైనా.. కేన్ విలియమ్సన్, హెన్రీచ్ నికోల్స్.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించారు.

 సంక్షిప్త స్కోర్లు..

సంక్షిప్త స్కోర్లు..

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 435/8 డిక్లేర్డ్ (జోరూట్ 153 నాటౌట్, హరీ బ్రూక్ 186)

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 209 ఆలౌట్(టీమ్ సౌథీ 73, బ్రాడ్ 4/61, అండర్సన్ 3/37)

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 202/3(టామ్ లాథమ్ 83, డెవాన్ కాన్వే 61)

Story first published: Sunday, February 26, 2023, 15:13 [IST]
Other articles published on Feb 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+