World Test Championship: ఫైనల్‌కు న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తేనే ఇండియాకు ఛాన్స్!

సిడ్నీ: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే.. న్యూజిలాండ్ జట్టును మాత్రం టెన్షన్ లేకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేర్చింది. ఫలితంగా అరంగేట్ర టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా కివీస్ గుర్తింపు పొందింది. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన 3 టెస్ట్‌ల సిరీస్ కరోనా కారణంగా వాయిదా పడటంతో న్యూజిలాండ్‌కు ఫైనల్ బెర్త్ ఖాయమైంది.

టాప్‌లో భారత్.. అయినా?
అయితే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్ అవకాశాలు ఇతర సిరీస్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది. టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్ పట్టికలో టీమిండియా 71.67 విజయాల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 70 , ఆస్ట్రేలియా(69.16), ఇంగ్లండ్(68.7) విజయాల శాతంతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇందులో న్యూజిలాండ్ చాంపియన్‌షిప్‌లోని మ్యాచ్‌లన్నిటిని పూర్తి చేసుకుంది. కాబట్టి ఆ జట్టు విజయాల శాతాల్లో ఏలాంటి మార్పు జరిగే అవకాశం లేదు. దాంతో ఫైనల్‌కు అర్హత సాధించింది.

రెండింటిలో ఓడితే..
ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్ ఫలితం మరో ఫైనలిస్ట్‌ను నిర్ణయించింది. భారత్‌కు ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఇంగ్లండ్‌ను 4-0, 3-0, 3-1 లేదా 2-0, 2-1తోనైనా ఓడించాలి. ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరాలంటే 3-0, 3-1తో భారత్‌ను ఓడించాలి. ఇలా జరగకుండా ఈ సిరీస్ డ్రా అయినా.. భారత్ రెండు టెస్ట్‌ల్లో ఓడినా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది.

కరోనా కారణంగానే..
ఫిబ్రవరి రెండో వారంలో సౌతాఫ్రికాలో పర్యటించాల్సిన ఆస్ట్రేలియా జట్టు తమ టూర్‌ను వాయిదా వేసుకుంది. సౌతాఫ్రికాలో కరోనా వైరస్ సెకండ్ ఫేస్ విజృంభిస్తుండటంతో ఆటగాళ్లు, జట్టు సిబ్బంది క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. వైద్య నిపుణల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ సిరీస్‌ను భవిష్యత్తులో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల సహాయ సహాకారలు అందిస్తుందని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications