New Zealand Playing XI: డేవాన్ కాన్వే ఔట్.. టీమ్ సీఫెర్ట్ ఇన్! ఆస్ట్రేలియాతో బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టు

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 తుది దశకు చేరకుంది. హాట్ ఫేవరేట్ జట్లన్నీ ఒక్కొక్కటిగా ఇంటిదారిపట్టగా ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అద్వితీయమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్-12 స్టేజ్‌లో సాదా సీదాగా ఆడిన ఈ రెండు జట్లు సెమీఫైనల్లో మాత్రం దుమ్మురేపాయి.
గ్రూప్ దశలో న్యూజిలాండ్ పాకిస్థాన్ చేతిలో.. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయాయి. అయితే అనూహ్యంగా సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓకే తరహాలో ఓడించాయి. రెండు సెమీఫైనల్స్ ఛేజింగ్ 19 ఓవర్లలోనే ముగియడం విశేషం. అయితే ఈ ఇరు జట్లలో ఫేవరేట్ ఎవరో చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయిదే న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వే సేవలను కోల్పోయిన నేపథ్యంలో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అసహనంతో గాయపడి..
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 167 పరుగుల చేజింగ్‌లో కాన్వే విలువైన 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఔటైన తర్వాత అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి పొరపాటున కొట్టుకోవడంతో గాయమైంది. దీంతో అతను ఫైనల్‌తో పాటు భారత్‌తో జరిగే అపక్‌మింగ్ టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ''అనూహ్యంగా అయిన గాయం కారణంగా ఫైనల్ ఆడలేకపోవడం కాన్వేను చాలా బాధిస్తోంది. ఈ గాయం అనుకోకుండా జరిగింది. ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో టీ20 సిరీస్‌లకు కాన్వేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. అయితే టీమిండియా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం'' అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే మెగా ఫైనల్లో కాన్వే గైర్వాజరీ టీమ్ సీఫెర్ట్ జట్టులోకి రానున్నాడు.

బలంగా టాపార్ట్..
మెగా ఫైనల్లో కూడా న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్ ప్రారంభించనున్నారు. మార్టిన్ గప్టిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా.. ఈ టోర్నీలో అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఇక డారిల్ మిచెల్ సెమీఫైనల్లో హీరోగా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో సమయోచితంగా ఆడుతూ జట్టుకు అద్బుత విజయాలందించాడు. ఫస్ట్ డౌన్‌లో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌కు రానున్నాడు. విలియమ్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన రోజున చెలరేగిపోతాడు. ఇక టీ20 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న గ్లెన్ ఫిలిప్ ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత టీమ్ సీఫెర్ట్ బరిలోకి దిగే అవకాశం ఉన్నా.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయవచ్చు. టీ20 ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జేమ్స్ నీషమ్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. మరోసారి అతను తన హిట్టింగ్ రోల్ పోషిస్తే ఆసీస్‌కు కష్టమే. మరో ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే నెంబర్ 6 వరకు అందరూ హార్డ్ హిట్టర్లే.

పటిష్టంగా బౌలింగ్..
ఇక బౌలింగ్ అయితే పూర్తి పటిష్టంగా ఉన్నది. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ స్పెషలిస్ట్ టీ20 బౌలర్లు. ఐపీఎల్‌తో పాటు ఈ టోర్నీలో కూడా వారి సామర్థ్యాలు ఏమిటో అందరూ చూశారు. వీరికి తోడుగా అడమ్ మిల్నే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు. ఇష్ సోథి, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్ విభాగం బలాన్ని పెంచుతున్నారు. సూపర్ బౌలింగ్‌కు మెస్మరైజింగ్ ఫీల్డింగ్ జట్టుకు లాభం చేస్తుంది. బౌండరీ లైన్ వద్ద న్యూజిలాండ్ ఆటగాళ్ల ఫీల్డింగ్ విన్యాసాలు ఇప్పటికే అభిమానులను అలరించాయి. భారీ సిక్సర్లను అడ్డుకోవడం.. అద్భుతంగా క్యాచ్‌లు అందుకోవడం న్యూజిలాండ్ స్పెషాలిటీ. ఫైనల్లో కూడా సమష్టిగా రాణిస్తే కివీస్ చాంపియన్‌గా నిలవడం ఖాయం.

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్, గ్లేన్ ఫిలిప్స్, టీమ్ సీఫెర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోదీ, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications