Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేన్ మామ.. ముగ్గురు అరంగేట్రం!

 New Zealand Opt to Bat First against England, Debuts for Bracey, Robinson, Conway

లండన్: రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. లార్ట్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్‌కు ముందు గాయపడ్డ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నా.. అతను బరిలోకి దిగాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఐపీఎల్ ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్లంతా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. గాయం మళ్లీ తిరగబెట్టడంతో జోఫ్రా ఆర్చర్ సేవలను కూడా ఇంగ్లండ్ కోల్పోయింది. దాంతో ఇంగ్లండ్ తరఫున ఓలీ రాబిన్సన్, జేమ్స్ బ్రేసీ అరంగేట్రం చేయగా.. న్యూజిలాండ్ తరఫున డేవన్ కాన్వే తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ సమ్మర్ సీజన్ మొదలవుతుండగా.. కివీస్ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు ప్రిపరేషన్‌గా భావిస్తోంది. ఇరు జట్లలో టాప్ ప్లేయర్లు అందుబాటులో ఉండటంతో పోరు హోరాహోరీగా సాగనుంది. వరుసగా ఐదు విజయాలతో ఊపు మీదున్న కివీస్.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా దిగుతోంది. భారత్‌తో ఆడిన గత సిరీస్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తుది జట్లు:
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్(కెప్టెన్), ఓలీ పోప్, డాన్ లారెన్స్, జేమ్స్ బ్రేసీ(కీపర్), ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్

టామ్ లాథమ్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, కైల్ జెమీసన్, టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్

Story first published: Wednesday, June 2, 2021, 15:45 [IST]
Other articles published on Jun 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+