ఆ నలుగురు జట్టులో ఉంటే న్యూజిలాండ్‌దే విజయం.. ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోతుందా?

హైదరాబాద్: ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కివీస్ అద్భుత ఆటతో దూసుకెళుతోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్‌లతో సమతూకంగా ఉన్న జట్టు వరుస విజయాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే పటిష్ట జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై సునాయాస విజయాలు అందుకుంది. భారత్, ఇంగ్లండ్‌లను అయితే చిత్తుచిత్తుగా ఓడించింది. వరుస టెస్ట్ సిరీస్ విజయాలతో అందరికంటే ముందే టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో కివీస్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

నలుగురు ఉంటే న్యూజిలాండ్‌దే విజయం:
ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ వరుస విజయాలకు అసలు కారణం ఆ జట్టు బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ మరియు కైల్ జేమిన్సన్‌లు నలుగురూ అద్భుతంగా రాణిస్తున్నారు. అద్భుత బంతులతో ఔరా అనిపిస్తున్నారు. ఆరంభంలో బౌల్ట్, సౌథీలు వికెట్లు తీస్తే.. ఆపై వాగ్నర్, జేమిన్సన్‌లు ప్రత్యర్థి పనిపట్టేవారు. స్వింగ్ బౌలింగ్, కివీస్ పరిస్థితులు కూడా వారికి కలిసొచ్చాయి. ఈ నలుగురు జట్టులో ఉన్న ప్రతిసారి న్యూజిలాండ్‌కు ఓటమే తెలియదు. డబ్ల్యూటీసీ మొదలయినప్పటి నుంచి దాదాపు ప్రతి మ్యాచ్ కివీస్ గెలిచింది. ఏదో ఒక సందర్భంలో మాత్రమే మ్యాచ్ డ్రా అయింది.
WTC Final 2021: టీమిండియాకు భారీ షాక్.. రెండు వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన!!

కివీస్ గెలుస్తుందేమో:
ప్రస్తుతం సౌథాంప్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ తరఫున ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ మరియు కైల్ జేమిన్సన్‌లు ఆడుతున్నారు. ఇదే ఇప్పుడు కోహ్లీసేనను కలవరపెడుతోంది. ఈ నలుగురు ఉన్న మ్యాచులో కివీస్ గెలుస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ గెలుస్తుందేమో అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే రికార్డులను బద్దలు కొట్టడం టీమిండియాకు అలవాటే. కాబట్టి ఫైనల్‌లో కోహ్లీసేన గెలుస్తుందని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

తొలి సెషన్‌లో రెండు వికెట్లు:
ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి సెషన్‌లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (6; 12 బంతుల్లో 1x4), చెతేశ్వర్ పుజారా (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6x4), శుభ్‌మన్ గిల్ (28; 64 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. రోహిత్ జేమీసన్ బౌలింగ్‌లో స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కగా మరో పరుగు తర్వాత గిల్.. వాగ్నర్ బౌలింగ్‌లో కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కోహ్లీ, పుజారా మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications