వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! పొట్టకూటికోసం బస్సులను కూడా శుభ్రం చేశాడు!

కాన్‌బెర్రా: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్.. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు. స్కై స్పోర్ట్స్ కోసం అతడు వ్యాఖ్యానం చేశాడు.

వెంటిలేటర్‌పై చికిత్స
గుండె లోపల నీరు చేరడంతో క్రిస్ కెయిన్స్ తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అతని కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి పలు ఆపరేషన్లు నిర్వహించినా.. సరిగ్గా స్పందించడం లేదు. దాంతో కెయిన్స్‌కు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ తర్వగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

62 టెస్టుల్లో 3320 పరుగులు, 218 వికెట్లు
51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు పడగొట్టాడు. 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు తీశాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కాగా క్రిస్ కెయిన్స్ సోదరుడు క్రిస్ హారిస్ కూడా కివీస్ తరపున మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
IND Vs ENG: ప్రేక్షకుల చెవుల్లో ఎర్రటి పరికరాలు.. అవెందుకో తెలుసా?

'సూపర్ స్టార్'లా కనిపించేవాడు
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ అప్పట్లో ఓ సంచలనం. మైదానంలో అతనో ఒక 'సూపర్ స్టార్'లా కనిపించేవాడు. జీనియస్‌లా బ్యాటింగ్ చేస్తూ.. నాణ్యమైన బౌలర్‌ను తలపించేలా బంతులు విసిరేవాడు. అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సిన అలాంటి వ్యక్తి చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అప్పటి ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపించారు. ఆపై ఐపీఎల్ వేలం నుంచి క్రెయిన్స్ పేరును కూడా తొలగించారు.

పొట్టకూటికోసం
గతంలో స్కై స్పోర్ట్స్ కోసం క్రిస్ కెయిన్స్ వ్యాఖ్యానం చేశాడు. జీవనం కోసం క్రికెట్‌కు సంబంధం లేని రంగాల్లో కూడా పనిచేశాడు. కెయిన్స్ 2017లో బస్టాండుల్లో బస్సులను కడుగుతూ జీవనం సాగించాడు. ట్రక్కులు నడుపుతూ.. బస్ షెల్టర్లను క్లీన్ చేశాడు. ప్రతిరోజు కష్టపడేవాడు. అలా బస్టాండుల్లో గంటకు 17 డాలర్లు సంపాదించేవాడు. కూడు.. గూడుకు పోను మిగిలినవి మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో న్యాయ ఖర్చుల కోసం వినియోగించాడు. క్రికెట్ అనంతరం దొరికిన పనల్లా చేశాడు. ఇప్పడు అనారోగ్య సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications