Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం క్యాచ్ రా అయ్యా.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగ లేదు! (వీడియో)

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో అసాధారణ క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. బౌండరీ లైన్ వద్ద వెల్లింగ్టన్ ప్లేయర్ ట్రాయ్ జాన్సన్ అసాధారణ ఎఫర్ట్‌తో అందుకున్న ఈ క్యాచ్ మరో ఫీల్డర్ నిక్ కెల్లీ ఖాతాలో చేరింది.

సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ జట్టు బ్యాటర్ విల్ యంగ్ లాంగాన్ దిశగా కొట్టిన ఈ భారీ షాట్‌ను జాన్సన్ వెనక్కి పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత సమన్వయం కోల్పోయిన అతను.. చాకచక్యంగా బంతిని లోపలికి విసిరాడు. అతని వెనుకాలే పరుగెత్తుకుంటూ వచ్చిన నిక్ కెల్లీ.. ఆ బంతిని అద్భుతంగా అందుకొని క్యాచ్‌ను పూర్తి చేశాడు.

 New Zealand Cricketer Takes Stunning Relay Catch goes Viral

దాంతో విల్ యంగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఫీల్డింగ్ ఎఫర్ట్‌గా ఇది నిలిచిపోయింది. ఈ క్యాచ్ ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. 'ఇదేం క్యాచ్ రా అయ్యా.. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగ లేదు'అని కామెంట్ చేస్తున్నారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అంటే ఇదేనని, ట్రాయ్ జాన్సన్ కష్టం.. నిక్ కెల్లీకి దక్కిందని సెటైర్లు పేల్చుతున్నారు.

ట్రాయ్ జాన్సన్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నా.. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్.. 17 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

Story first published: Saturday, January 13, 2024, 20:26 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+