Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs WI: మరోసారి చిత్తయిన వెస్టిండీస్.. కివీస్‌దే టెస్ట్ సిరీస్

New Zealand beat West Indies by an innings and 12 runs in 2nd Test

వెల్లింగ్టన్: వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లోనూ న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో చిత్తు చేసి 2-0తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో విండీస్ వీరులు విజయం లేకుండానే కివీస్ పర్యటనను ముగించారు. తొలుత మూడు టీ20ల సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న కరీబియన్లు.. తాజాగా రెండు టెస్టుల సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్‌కు గురయ్యారు. ఈ విజయంతో కివీస్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. టెస్ట్ చాంపియన్ షిప్ టేబుల్లో భారత్, ఆస్ట్రేలియా తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకుంది.

244/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ 317 పరుగులకు ఆలౌటైంది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (89 బంతుల్లో 60 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. టిమ్ సౌతి, కైల్ జేమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ .. హెన్రీ నికోలస్ (280 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో 174) భారీ శతకం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులకు ఆలౌటైంది. నికోలస్‌తో పాటు ఆఖర్లో నైల్ వాగ్నర్ ( 42 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 131 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో బ్లాక్‌వుడ్ ( 92 బంతుల్లో 11 ఫోర్లతో 69) టాప్ స్కోరర్‌కాగా.. టిమ్ సౌథీ, జెమీషన్ ఐదేసి వికెట్లు పడగొట్టారు. దాంతో.. 329 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న న్యూజిలాండ్.. కరీబియన్లను ఫాలో ఆన్‌ ఆడించింది. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఓపెనర్ క్యాంప్‌బెల్ కెప్టెన్ జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీలు బాదినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో సిల్వా (57) ఒంటరిపోరాటం చేశాడు.

సంక్షిప్త స్కోర్లు:
న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 460 ఆలౌట్; వెస్టిండీస్ 131 ఆలౌట్
వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ 317 ఆలౌట్

Story first published: Monday, December 14, 2020, 12:07 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+