Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng vs NZ: చెలరేగిన వాగ్నర్, హెన్రీ.. 22 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన కివీస్!

New Zealand beat England by 8 wickets seal memorable series win
New Zealand Memorable Series Win VS ENG | Oneindia Telugu

బర్మింగ్​హామ్: నీల్ వాగ్నర్(3/18), మాట్ హెన్రీ(3/36) మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్‌ తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో 8 వికెట్లతో తేడాతో సునాయస విజయాన్నందుకొని రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. 122/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ పరుగులేమి చేయకుండానే ఆల్‌టైంది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 85 రన్స్ లీడ్ సాధించిన న్యూజిలాండ్ ముందు 41 పరుగుల లక్ష్యమే నమోదైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 10.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 388 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలి ఓటమికి తలవొంచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సూపర్ బౌలింగ్ చేసిన మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కివీస్ బ్యాటింగ్‌లో డబుల్ సెంచరీ హీరో డేవాన్ కాన్వే(80) హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించగా.. విల్ యంగ్(82), రాస్ టేలర్(82) ఫామ్‌లోకి వచ్చారు. ప్రతిష్టాత్మక ఫైనల్ ముందు ఈ సిరీస్ విజయం ఆ జట్టుకు లాభం చేకూర్చనుంది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా ఈ మెగా ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పోరు భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఈ విజయంతో న్యూజిలాండ్ టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఆ​ జట్టు 123 పాయింట్లతో టీమిండియా 121 పాయింట్లను వెనక్కు నెట్టింది. ఇక ఇంగ్లాండ్​ గడ్డపై 22 ఏళ్ల తర్వాత సిరీస్​ విజయాన్ని అందుకుంది కివీస్ జట్టు. చివరగా 1999లో టెస్ట్​ సిరీస్​ను గెలుపొందింది.

Story first published: Sunday, June 13, 2021, 18:57 [IST]
Other articles published on Jun 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+