IND vs NZ: ట్రెంట్ బౌల్ట్ ఔట్.. భారత్ పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ జట్టు ఇదే!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌తో న్యూజిలాండ్ మూడు టీ20లు, మూడు టెస్ట్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన జట్ల వివరాలను న్యూజిలా క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. స్పిన్ అడ్డా అయిన భారత్‌లో గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్న న్యూజిలాండ్.. ఈ పర్యటన కోసం ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. బయోబబుల్, తీరిక లేని షెడ్యూల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్ హోమ్ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోనే న్యూజిలాండ్ ఈ రెండు సిరీస్‌ల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. డేవాన్ కాన్వే, టిమ్ సౌథీ, రాస్ టేలర్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.
న్యూజిలాండ్ టెస్ట్ టీమ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్న్
న్యూజిలాండ్ టీ 20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్ (వికెట్ కీపర్), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే
ఇక న్యూజిలాండ్‌తో జరగబోయే ఈ టీ20 సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి పలువురు సీనియర్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. దాంతో టీమ్‌ను కేఎల్ రాహుల్ నడిపించే అవకాశం ఉంది.
ఇక ఈ సిరీస్ ప్రేక్షకుల మధ్యే జరుగుతుందని, పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలు పెట్టామని, స్థానిక అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపాయి. హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications