IND vs NZ: సిరాజ్ తీన్మార్.. నాలుగేసిన అశ్విన్.. న్యూజిలాండ్ 62 ఆలౌట్! భారత్‌కు భారీ ఆధిక్యం!

ముంబై: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) వికెట్లతో విరుచుకుపడటంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కైల్ జెమీసన్(17), టామ్ లాథమ్(10) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్, అక్షర్‌కు తోడుగా జయంత్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. దాంతో భారత్ 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

సిరాజ్ శుభారంభం..
ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ ధాటికి ఒకే ఓవర్‌లో ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్లు టామ్ లాథమ్(10), విల్ యంగ్(4)ను తనదైన బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముందుగా విల్ యంగ్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. ఆ తర్వాత టామ్ లాథమ్‌ను షార్ట్ పిచ్ బాల్‌తో బొల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో సూపర్ ఇన్ స్వింగ్ డెలవరీతో టేలర్ ఆఫ్ స్టంప్ ఎగరగొట్టాడు. దాంతో 17 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.

స్పిన్ త్రయం..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారెల్ మిచెల్(8)ను అక్షర్ పటేల్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మిచెల్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ కొద్ది సేపటికి క్రీజులోకి వచ్చి హెన్రీ నికోల్స్‌ను అశ్విన్ తన ఫస్ట్ ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే జయంత్ యాదవ్.. రచిన్ రవీంద్రను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో కివీస్
38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్కోర్‌తోనే ఆ జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది.

చెలరేగిన అశ్విన్..
విరామం అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. 12 ఓవర్ల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్(8)ను అశ్విన్ క్యాచ్ ఔట్ చేయగా.. అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన టీమ్ సౌథీ ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో సోమర్ విల్లే(0), కైల్ జెమీసన్ పోరాడే(17) ప్రయత్నం చేశారు. సోమర్ విల్లే ఒక్క పరుగు చేయకుండా ఏకంగా 26 బంతులు ఆడాడు. కానీ అతన్ని అశ్విన్ క్యాచ్ ఔట్‌గా వెనక్కి పంపాడు. తన మరుసటి ఓవర్‌లోనే కైల్ జెమీసన్‌ను కూడా అశ్విన్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్ 325 ఆలౌట్..
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications