Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ. 240 కోట్లతో నిర్మాణం.. కూల్చి వేయనున్న న్యూయార్క్ స్టేడియం!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మైదానంలో ఇదే చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 ప్రపంచకప్ 2024 ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది. లీగ్ మ్యాచ్‌లను న్యూయార్క్‌తో పాటు ఫ్లోరిడా, డల్లాస్‌లో నిర్వహించింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ ఏకంగా రూ. 240 కోట్లతో న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. మూడు నెలల్లోనే 34 వేల సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తెచ్చింది.

New York Stadium will be dismantled after the T20 World Cup 2024

అయితే ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లను రెడీ చేయడంతో అన్నీ మ్యాచ్‌లు లో స్కోరింగ్ గేమ్స్‌గా మారాయి. ముఖ్యంగా బ్యాటర్లు అనూహ్య బౌన్స్, టర్న్, పేస్‌తో ఇబ్బంది పడ్డారు. దాంతో ఈ మైదానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో అభిమానులు కోరుకున్న అసలు సిసలు మజా లభించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా 140 పరుగులు చేయలేదు.

టీ20 ప్రపంచకప్ 2024 కోసం తాత్కలికంగా ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఈ టోర్నీ అనంతరం కూల్చేయనున్నారు. ఈ వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 7 మ్యాచ్‌ల కోసం రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచి.. ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఖర్చుకు వెనుకాడటం లేదు.

Story first published: Wednesday, June 12, 2024, 19:34 [IST]
Other articles published on Jun 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+