Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనా నెహ్వాల్‌కు తప్పని నిరాశ, టోర్నీ నుంచి ఇంటికి..

Denmark Open: Saina Nehwal good, Tai Tzu-Ying too good

న్యూ ఢిల్లీ: ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనా 52 నిమిషాల్లో 13-21, 21-13, 6-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది.

తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది 11వ పరాజయం

తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది 11వ పరాజయం

విజేత తై జు యింగ్‌కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్‌ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్‌కాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్‌ చేతిలోనే సైనా ఓడిపోయింది.

'క్రీడాకారులకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం అందించండి'

విరామానికి 11–5తో ఆధిక్యంలో సైనా

విరామానికి 11–5తో ఆధిక్యంలో సైనా

ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్‌ ఆడుతోన్న తై జు యింగ్‌ తొలి గేమ్‌ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6-1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11-5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది.

శ్రీకాంత్‌.. చేతిలో ఓటమికి గురై

శ్రీకాంత్‌.. చేతిలో ఓటమికి గురై

నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం తై జు యింగ్‌ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్‌ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌, జపాన్ షట్లర్ కెంటో మొమోటా చేతిలో ఓటమి పాలయ్యాడు.

శ్రీకాంత్ తప్పిదాలను కెంటో విజయవంతంగా

శ్రీకాంత్ తప్పిదాలను కెంటో విజయవంతంగా

పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 16-21, 12-21 స్కోరుతో నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ కెంటో మొమొటా (జపాన్‌) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నాడు. 42 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తుదికంటా పోరాడాడు. కెంటో... కిదాంబి శ్రీకాంత్‌పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. శ్రీకాంత్ చేసిన తప్పిదాలను కెంటో విజయవంతంగా ఉపయోగించుకున్నాడు. కెంటో, శ్రీకాంత్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచు‌ల్లో తలపడగా కెంటో ఐదుసార్లు పైచేయి సాధించాడు.

Story first published: Monday, October 22, 2018, 17:37 [IST]
Other articles published on Oct 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+