Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఆ ఇద్దరిపై వేటు వేసాం: హార్దిక్ పాండ్యా

ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే టీమ్ కాంబినేషన్‌ను మార్చామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. డానిష్ మలేవార్, క్రిష్ భగత్ అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. ఈ ఇద్దరి కోసం ర్యాన్ రికెల్టన్, ట్రెంట్ బౌల్ట్‌లపై వేటు వేసామని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

తుది జట్టులో రెండు మార్పులు చేశామని టాస్ సందర్భంగా వెల్లడించిన హార్దిక్ పాండ్యా.. తమ జట్టు పుంజుకోవడానికి ఈ మ్యాచ్ చివరి అవకాశామని చెప్పాడు. 'టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నాం. ఒక జట్టుగా పుంజుకోవడానికి ఇది మాకు చివరి మ్యాచ్. ముంబై ఇండియన్స్ సత్తా చూపించాలని, అందుకోసం ఎలా ఆడాలనే విషయాల గురించి మేం చర్చించుకున్నాం.

అందరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మేం పుంజుకున్నాం. ఈ సారి కూడా గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉన్నాం. ఒకరికొకరు అండగా ఉంటూ ముందుకు సాగాలనుకుంటున్నాం. కష్టకాలం ఉండవచ్చు, కానీ ఒకరికొకరు తోడుగా ఉంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

New Faces New Intent Hardik Pandya Reveals Strategy Behind MI s Playing XI Changes vs GT
Photo Credit: screen grab for JioHotstar

మేం జట్టుగా మెరుగపడాలి. మా ఓటములకు ఒకే ఒక కారణాన్ని నేను చెప్పలేను. మేం కలిసి గెలుస్తాం. కలిసి ఓడిపోతాం. కాబట్టి ఒక సమూహంగా మేం మెరుగుపడాలి. ఇదొక కొత్త రోజు.. సూర్యుడు మళ్ళీ ఉదయించాడు. మేము సానుకూల దృక్పథంతో ఉన్నాం. మా జట్టులో ఈరోజు ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు.

డానిష్ మలేవార్‌తో పాటు క్రిష్ భగత్ బరిలోకి దిగుతున్నారు. క్రిష్ భగత్ మాకు నెట్ బౌలర్‌గా సేవలందించాడు. అతని ప్రదర్శన మమ్మల్ని ఆకట్టుకుంది. మూడు రోజుల క్రితమే అతను ప్రధాన జట్టులోకి వచ్చాడు. జీవితం అంటే ఇదే. ఈ రోజు అతను తుది జట్టులో ఆడుతున్నాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని చెప్పాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కాగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ.

ముంబై ఇండియన్స్: డానిష్ మలేవార్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, ఎ.ఎమ్. గజన్‌ఫర్.

Story first published: Monday, April 20, 2026, 20:15 [IST]
Other articles published on Apr 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+