Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలాంటి నగరాన్ని చూస్తాననుకోలేదు: గంగూలీ

Never Thought Would See My City Like This, Writes Sourav Ganguly Sharing Pictures Of Deserted Kolkata Streets

కోల్‌కతా: మనుషులు బయటకు రాని కోల్‌కతా నగరాన్ని తన జీవితంలో చూస్తానని అనుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు దేశమంతా లాక్‌డౌన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా నగరంలో ప్రస్తుత దృశ్యాలను ఎప్పుడూ చూస్తానని అనుకోలేదని దాదా ట్వీట్ చేశాడు.

'నా నగరాన్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. అందరూ సురక్షితంగా ఉండండి. పరిస్థితి త్వరలోనే మెరుగవుతుంది. మీ అందరిపై నా ప్రేమ కొనసాగుతుంది' అని అని గంగూలీ ట్వీట్‌ లో పేర్కొన్నాడు. నిర్మానుష్యంగా కనిపిస్తున్న కోల్‌కతా వీధుల ఫొటోలను కూడా జత చేశాడు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 16వేల మంది మరణించారు. భారత్‌‌లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 500కు చేరుకోగా 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా క్రీడలన్నీ వాయిదా పడ్డాయి. ఐపీఎల్‌ను బీసీసీఐ సైతం వాయిదా వేసింది. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

Story first published: Tuesday, March 24, 2020, 21:40 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+