నవ్‌దీప్ సైనీ గీ ఎచ్చిడే వద్దనేది.. ముందు ఆటపై ఫోకస్ చేయ్.. నెటిజన్ల ఫైర్

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి 'భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి' అంటూ క్యాప్షన్‌గా జతచేశాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్ చూసిన కొందరు నవ్‌దీప్‌ను మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు.

ఈ ఎచ్చిడే వద్దంటున్నాం..
క్రికెటర్ అయుండి ఇలా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరొకరు మండిపడ్డారు. 'ఒక క్రికెటర్ అయ్యుండి ఇలాగేనా చేసిది?ముందు బౌలింగ్ మీద దృష్టి పెట్టు. ఇలాంటి వాటితో ఒరిగేదేం లేదు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం కష్టపడాలి. సచిన్, వినోద్ కాంబ్లీ.. ఇద్దరూ నైపుణ్యమున్న ఆటగాళ్లే. కానీ చివరికి ఎవరెలా ఉన్నారో నీకు తెలుసు కదా. హీరోలా ఎక్కువ చేయకు.'అని మరొకరు మండిపడ్డారు. ఈ తరహా ఎచ్చిడే తగ్గించుకుంటే మంచిదని మరొకరు కామెంట్ చేశారు.

ఎంపికై రెండేళ్లే..
'భారత జట్టుకు నువ్వు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైనా ఈ వీడియోను చూడండి. ఇలా చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తారు. మరికొంతమంది మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని కొనియాడుతున్నారు. హీరోలా ఉంది సైనీ భయ్యా అంటూ కొనియాడుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీకి ఫిదా అవుతున్నారు.

జట్టులో చోటు గల్లంతు..
కాగా, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నవ్‌దీప్ సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో కూడా ఆర్‌సీబీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మహ్మద్ సిరాజ్ అదరగొడుతుండటంతో సైనీకి ఆర్‌సీబీతో పాటు టీమిండియా జట్టులోనూ చోటు లేకుండా పోయింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికవ్వలేదు. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలోనే నెటిజెన్లు అతడిపై విరుచుకుపడుతున్నారు. తొలుత ఆట మీద ధ్యాస పెట్టాలని, ఇలాంటివి చేసి ఉన్న పేరు పోగొట్టుకోవద్దని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications