Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: చాహల్ కోసం బిష్ణోయ్‌కు అన్యాయమా? రిషభ్ పంత్ ‌అవసరమా? ఫ్యాన్స్ ఫైర్!

Netizens Trolls Indian Playing 11 vs SL: Asks Why Rishbah Pant And Chahal

దుబాయ్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఎంపికను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసియాకప్‌ 2022లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. శ్రీలంకలో లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా జట్టులోకి తీసుకొచ్చింది. అయితే అశ్విన్ కోసం గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రవిబిష్ణోయ్‌పై వేటు వేసింది.

చాహల్ ఎందుకు..?

ఈ నిర్ణయమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దారుణంగా విఫలమైన యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టకుండా బిష్ణోయ్‌ను పక్కన పెట్టడం ఏందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ క్రికెటరనే చాహల్‌ను కొనసాగించారా? అని మండిపడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ బిష్ణోయ్‌ను పక్కనపెట్టాల్సింది కాదని, చాహల్‌పై వేటు వేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆటను చూడకుండా పేరును చూసి ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు.

పంత్‌కు మరో చాన్స్..

రిషభ్ పంత్‌కు కూడా మరో అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. గత మ్యాచ్‌లో పేలవ షాట్‌‌తో జట్టు ఓటమికి కారణమైన పంత్‌ను పక్కనపెట్టాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే రవీంద్ర జడేజా గాయం కార్తీక్ కొంప ముంచిందని, లెఫ్టాండర్ బ్యాటర్ జట్టులోలేకపోవడం పంత్‌కు కలిసొస్తుందని కామెంట్ చేస్తున్నారు.

అందుకే అశ్విన్..

శ్రీలంక జట్టు బ్యాటింగ్ విభాగం ఆధారంగానే రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోచ్చామని రోహిత్ తెలిపాడు. శ్రీలంకలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్న నేపథ్యంలోనే అశ్విన్‌ను తీసుకున్నామని వెల్లడించాడు. ఇది టీమ్ ప్రణాళికని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని, పిచ్ ఏ మాత్రం మారలేదన్నాడు. ఈ రోజు వికెట్‌పై గడ్డి తక్కువగా ఉందని, పూర్తిగా డ్రైగా ఉందన్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్‌ను తీసుకొచ్చామని తెలిపాడు.

13 పరుగులకే 2 వికెట్లు..

టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(6), విరాట్ కోహ్లీ(0) వెనువెంటనే ఔటయ్యారు. తీక్షణ వేసిన రెండో ఓవర్‌లో రాహుల్ అంపైర్ తప్పిదం కారణంగా ఎల్బీ డబ్ల్యూ కాగా.. దిల్షాన్ మదుషంక బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులోరోహిత్ శర్మ(4 బ్యాటింగ్)తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.

Story first published: Tuesday, September 6, 2022, 20:10 [IST]
Other articles published on Sep 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+