
బీసీసీఐ.. ఇదేం వివక్ష..
పురుష క్రికెటర్ల కాంట్రాక్టుల్లో గ్రేడ్ ఏ+లో ఉన్న వారికి రూ. 7 కోట్లు.. గ్రేడ్ 'ఎ'లో ఉన్న వారికి ఏడాదికి రూ. 5 కోట్లు... గ్రేడ్ 'బి' వారికి రూ. 3 కోట్లు... గ్రేడ్ 'సి' వారికి కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కానీ మహిళల క్రికెటర్లలో గ్రేడ్ ఏలో ఉన్నవారికి మాత్రం రూ. 50 లక్షల వేతనమే ఇస్తున్నారు.
మహిళల టాప్ గ్రేడ్‌కు పురుషుల ఏ+ గ్రేడ్‌కు 14 రెట్ల వ్యత్యాసం ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈక్వల్ పే అందించాలని కొంతమంది అంటుండగా.. కనీసం గౌరవ వేతనాలైన అందించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
14 రెట్లు వ్యత్యాసమా?
మహిళా క్రికెటర్ల కనీసం టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్‌కు వెళ్లారని పురుష క్రికెటర్లు మాత్రం సెమీఫైనల్లోనే ఇంటి దారిపట్టారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయినా విరాట్ కోహ్లీకి హర్మన్ ప్రీత్ కౌర్ కంటే 14 రెట్లు ఎక్కువ జీతం అందుతుందని, వారికి గౌరవ వేతం ఇచ్చి అండగా నిలవాలని కోరాడు. అమ్మాయిలు క్రికెట్ బాగా ఆడుతున్నారని, వారికి మంచి జీతాలు అందజేయాలని మరో నెటిజన్ విజ్ఞప్తి చేశాడు.
కనీసం ఏ గ్రేడ్ వారికి రూ. 3 కోట్లు, బీ గ్రేడ్ రూ.2 కోట్లు, సీ గ్రేడ్ వారికి కోటీ రూపాయలైన ఇవ్వాలని మరో అభిమాని సూచించాడు. ఈ కాంట్రాక్టులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని, వీటిని పున:పరిశీలించాలని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

ఈ జీతాలిచ్చేందుకు సిగ్గుండాలి..!
మహిళా క్రికెటర్లకు ఈ జీతాలిచ్చేందుకు బీసీసీఐకి సిగ్గుండాలని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కిరణ్ రిజిజు జోక్యం చేసుకొని మహిళా క్రికెటర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా క్రికెటర్లు గౌరవప్రదమైన జీతాలు అందించాలని, ఈ వివక్షను రూపుమాపాలని మండిపడుతున్నారు.
సుదీర్ఘకాలంగా మహిళా క్రికెట్‌కు సేవలందిస్తున్న మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలకు రూ. 30 లక్షల వేతనం అంటే జీర్ణించుకోలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. మహిళల టీమ్ టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిందని, వారికి తగిన ప్రోత్సాహం అందించాలని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులు..
గ్రేడ్ 'ఎ' (రూ. 50 లక్షలు ): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్.
గ్రేడ్ 'బి' (రూ. 30 లక్షలు ): మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్.
గ్రేడ్ 'సి' (రూ. 10 లక్షలు ): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్.

పురుష క్రికెటర్ల కాంట్రాక్టులు..
గ్రేడ్ 'ఎ+' (రూ. 7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
గ్రేడ్ 'ఎ' (రూ. 5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా
గ్రేడ్ 'బి' (రూ. 3 కోట్లు): వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్
గ్రేడ్ 'సి' (రూ. 1 కోటి): కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












