హెల్త్ సప్లిమెంట్ యాడ్‌తో..
అసలే తమ అభిమాన ఆటగాడు సరిగ్గా ఆడటం లేదనే మంట మీదున్న అభిమానులకు కోహ్లీ అడ్వర్టైజ్‌మెంట్ మరింత చికాకుకు గురిచేసింది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ పుణ్యానా టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని తెగ ఎంజాయ్ చేసిన కోహ్లీ.. సోమవారం ట్విటర్ వేదికగా హెల్త్ సప్లిమెంట్ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్ షేర్ చేశాడు. 'వెల్‌మ్యాన్.. ఆట మీది ఒత్తిడి తాలుకు ప్రభావం మన మీద పడనివ్వం.. అందుకు బదులుగా ఆటను మార్చుకుంటాం. నా కూపన్ కోడ్ నాన్‌స్టాప్‌తో కొనుగోలు చేస్తే స్పెషల్ ఆఫర్ 'అంటూ ఓ వీడియోను కోహ్లీ ట్వీట్ చేశాడు.
నువ్వు మా కోహ్లీవి కాదు..
ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. 'నువ్వు ఏ మాత్రం మా విరాట్ కోహ్లీవి కాదు. నీకు డబ్బు పిచ్చిపట్టింది.ఆటపై శ్రద్ద తగ్గింది. నిన్ను జట్టు నుంచి తప్పించాల్సిందే. ఆటపై దృష్టి పెట్టకుండా ఇలా సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నావు. అయినా పరుగులే చేయలేని వాడికి విటమిన్స్ తీసుకుంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఈ అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్! నువ్వు ఇందుకే పనికివస్తావు'అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
నిన్ను సపోర్ట్ చేయడం..
ఇంతగా విఫలమవుతున్నా వెనకేసుకురావడం తమ తప్పని మండిపడుతున్నారు. 'అయినా నీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం లేదని, నీ జీవితంలో మిగిలింది బయోపిక్ మాత్రమేనని సెటైర్లు పేల్చుతున్నారు. సప్లిమెంట్స్‌కు కూపన్ కాదు.. సెంచరీ చేయాలంటే ఏదైనా కూపన్ ఉందా? ముందు అది తీసుకో'అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం విరాట్‌కు అండగా నిలుస్తున్నారు. ప్రతీది ఫామ్‌కు లెంకపెట్టి విమర్శలు చేయడం సరికాదంటున్నారు.
ఆదుకున్న పంత్..
ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), జేసన్ రాయ్ (31 బంతుల్లో 7 ఫోర్లతో 41) రాణించారు. హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా రాణించారు. పంత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'... హార్దిక్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.


Click it and Unblock the Notifications
