Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Stuart Broad: దొడ్డిదారిన గెలిచిన ఆ ప్రపంచకప్‌ను ఇచ్చేయండి.. అనైతికం గురించి మీరే మాట్లాడాలి! ఫ్యాన్స్ ఫైర్

Netizens slams Stuart Broad for calling MCC law change unfair

న్యూఢిల్లీ: క్రికెట్‌లో మన్కడింగ్ అనైతికం అనే చర్చకు ముగింపు పలుకుతూ.. క్రికెట్ చట్టాలను సంరక్షించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) కీలక మార్పులు చేసింది. మన్కడింగ్‌ను రనౌట్ కేటగిరిలోకి మార్చింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తప్పుబట్టాడు. ఏ లెక్కన చూసిన ఇది నైతికం కాదన్నాడు. బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం బౌలర్‌కు ప్రత్యేకమైన స్కిల్ అని, మన్కడింగ్ చేయడంలో అదెక్కడ ఉందని ప్రశ్నించాడు. మన్కడింగ్ చేయడం ముమ్మాటికి అనైతికమేనని వాదించాడు. ఇది ఏ మాత్రం ఆహ్మానించదగిన విషయం కాదని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్‌ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అసలు అనైతికం గురించి మీ ఇంగ్లండ్ ఆటగాళ్లే మాట్లాడాలి? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. మన్కడింగ్ అంత అనైతికంగా అనిపిస్తే.. 2019 వన్డే ప్రపంచకప్‌లో బౌండరీ కౌంట్ నిబంధన ముచ్చట ఏందని ప్రశ్నిస్తున్నారు. ఆ నిబంధన అనైతికమని ప్రపంచకప్‌ను వదిలేయాల్సిందని నిలదీస్తున్నారు. బౌండరీల కౌంటే కాదు.. న్యూజిలాండ్ జరిగిన నాటి ఫైనల్లో ఇంగ్లండ్ ఇలాంటి అనైతిక నిబంధనలను అడ్డుపెట్టుకొనే విశ్వ విజేతగా నిలిచిందనే విషయం మరిచిపోవద్దని చురకలంటిస్తున్నారు.

'అయినా మన్కడింగ్‌ స్కిల్ అని ఎవడు చెప్పాడు?.. అది చేసిన తప్పిదానికి విధిస్తున్న శిక్ష. బౌలర్ బంతి వేయకుండానే క్రీజు ధాటిన బ్యాట్స్‌మన్‌కు విధిస్తున్న శిక్ష. ఇక ట్రాపిక్ పోలీస్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు వేసే శిక్షలాంటిదే'అని మాజీ క్రికెటర్ వీవీ రామన్ చురకలంటించాడు. అలా ఆలోచిస్తే వైడ్ బాల్‌కు స్టంప్ చేయడం కూడా తప్పేనని ఇంకొకరు గుర్తు చేశారు. ఇక బ్యాట్‌కు తగిలి వెళ్లిన బంతికి 6 పరుగులు తీసుకోవడం ఏం నైతికమో బ్రాడ్ చెప్పాలని మరొకరు సెటైర్ పేల్చాడు. 'బంతిని బ్యాట్‌తో బాది పరుగులు తీయడమే ప్రతిభ.. ఓవర్ త్రోలా ద్వారా వచ్చిన పరుగులు అనైతికం.. వెంటనే ప్రపంచకప్‌ను న్యూజిలాండ్‌కు ఇచ్చేయండి'అని ఓ నెటిజన్ చురకలంటించాడు.

ఇక భారత మాజీ ఆటగాళ్లు మాత్రం ముందు ఆ పేరును తొలగించి మని పనిచేశారంటున్నారు. 1948లో తొలిసారి భారత దిగ్గజం వినూ మన్కడ్‌.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్‌ బ్రౌన్‌ను ఇలా ఔట్‌ చేశాడు. దానికి ఆస్ట్రేలియా మీడియా మన్కడింగ్‌ అనే పేరు పెట్టింది. ఇంత కాలం అది ఐసీసీ క్రికెట్‌ చట్టాల్లోని అన్యాయమైన ఆట విభాగంలో ఉండేది. కానీ దీన్ని రనౌట్‌ కిందకు మారుస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది.

Story first published: Thursday, March 10, 2022, 15:44 [IST]
Other articles published on Mar 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+