MS Dhoni సక్సెస్‌ను తట్టుకోలేకపోతున్న గంభీర్.. చెత్త క్రికెటర్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ బీజేపే ఎంపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్‌డే సందర్భంగా అతను చేసిన పనే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. నేడు (బుధవారం) మహీ 40వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గౌతం గంభీర్ ఈ రోజే తన ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటో మార్చాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులతో రాణించిన గంభీర్.. నాటి మ్యాచ్ ఫొటోను ఎఫ్‌బీ కవర్ పిక్‌గా పెట్టాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడో లేక మాములుగానే పెట్టాడో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ మాజీ ఓపెనర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఓర్వలేకపోతున్నాడు..
మహీ సక్సెస్‌ను గంభీర్ తట్టుకోలేకపోతున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'మహీ బర్త్ డే రోజే గంభీర్ తన ఎఫ్‌బీ కవర్ పిక్ మార్చాడు. అది కూడా తన ఫైనల్ నాక్ గుర్తు చేసే ఫొటో. అంటే వన్డే ప్రపంచకప్ మహీ ఒక్కడి వల్లే రాలేదు.. నేను కూడా ఆడానని అభిమానులకు గుర్తు చేయాలనుకున్నాడో ఏమో'అని ఓ అభిమాని సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ.. రాజకీయాల్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. గంభీర్ ఆహ్వానించాలని, అప్పుడు మజా ఉంటుందని మరో అభిమాని కామెంట్ చేశాడు.
సిగ్గు పడుతున్నాం..
గంభీర్ చేసిన పని పట్ల తాము సిగ్గుపడుతున్నామని మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే గంభీర్ కవర్ పిక్ మార్చాడంటున్నారు. ఓ వ్యక్తిగా గంభీర్ అత్యంత చెత్త క్రికెటరని మరో అభిమాని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ధోనీ మైదానంలోనే కాకుండా రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంతతను కొనసాగిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా తనపై విమర్శలు చేసే వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కానీ చాలా మందికి ఇది సాధ్యం కాదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
ధోనీ ఒక్కడి వల్లే రాలేదు..
ఇక ధోనీని గంభీర్ చాలా సార్లు బహిరంగంగానే విమర్శించాడు. అతని ఒక్కడి వల్లనే భారత్ ప్రపంచకప్ గెలవలేదని, టీమ్ మొత్తం రాణిస్తేనే చిరస్మరణీయ విజయం దక్కిందని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. '2011 వన్డే వరల్డ్‌కప్ భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా భారత జట్టు, సహాయక సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైంది. ధోనీ సిక్సర్ ఒక్కటే విజయాన్నందించలేదు. సమష్టి ఆటతీరువల్లే ఈ విజయం దక్కింది'అని క్రిక్ ఇన్‌ఫో చేసిన ఓ ట్వీట్‌కు గంభీర్ గతంలో బదులిచ్చాడు.

గంభీర్‌కు దక్కని క్రెడిట్
శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి గట్టెక్కించాడు. కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని పలు ఇంటర్వ్యూల్లో గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే పరిస్థితి. ఆ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేసినా మొండిగా పోరాడి భారత్‌కు పోరాడే స్కోరు అందించింది మాత్రం గంభీర్ అనే విషయం చాలామందికి తెలియదు. 54 బంతుల్లోనే 75 పరుగులు చేసి జట్టు స్కోరును 155కు చేర్చాడు. కానీ ఈ రెండు ప్రపంచకప్ విజయాల్లో గంభీర్ పేరు మాత్రం వినిపించదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications