Sanju Samson ఏ పాపం చేశాడు? ఏళ్లు గడిచినా.. కెప్టెన్లు మారినా అవకాశం మాత్రం రావడం లేదు!

మౌంట్‌మాంగనీ: టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించగా.. బీసీసీఐ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని భావించిన అతని అభిమానులకు వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. సంజూ శాంసన్‌కు బదులు దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లకు అవకాశం ఇచ్చింది. ఈ ఇద్దరూ కూడా ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. దాంతో సంజూ శాంసన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏ పాపం చేశాడు..?
ఏళ్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారుతున్నా.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీపక్ హుడాకు ఎన్ని అవకాశాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అతని కంటే సంజూ శాంసన్ ఆడించినా జట్టుకు మేలు ఉండేదని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ పట్ల ఇంత వివక్ష ఏంటో తమకు అర్థం కావడం లేదని, అతను చేసిన పాపం ఏంటని మండిపడుతున్నారు. రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనికి అండగా నిలుస్తున్నారని, అలాంటి మద్దతు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే టీమిండియా కెప్టెన్ అయ్యేవాడని అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్ ఓడినా సిగ్గు రాలేదు..
ఇన్ని రోజులు అవకాశాలిచ్చినా రాణించని ఆటగాళ్లను పక్కనపెట్టాలని, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అండగా నిలవాలని మరికొందరు సూచిస్తున్నారు. కొందరైతే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టేందుకు బీసీసీఐకి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుతున్న బీసీసీఐ.. సంజూ శాంసన్‌ను టార్చర్ చేస్తుందని మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ కోల్పోయినా.. బీసీసీఐకి సిగ్గురాలేదని చురకలంటిస్తున్నారు. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా సంజూకు చోటు దొరక్కపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
శతక్కొట్టిన సూర్య..
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సంజూ శాంసన్‌కు బదులు జట్టులోకి వచ్చిన దీపక్ హుడా(0) గోల్డెన్ డకౌటవ్వగా.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషభ్ పంత్(6) మరోసారి నిరాశపరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications