Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘షేన్ వార్న్ ఓ ఆర్డినరీ బౌలర్’.. ఓయ్ గవాస్కర్ నీకు బుద్దుందా? ఏ టైమ్‌లో ఏం మాట్లాడుతున్నావ్?

Netizens slam Sunil Gavaskar for ‘belittling’ Shane Warne’s achievements

న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియా వేదికగా లిటిల్ మాస్టర్‌ను నెటిజన్లు రోస్ట్ చేస్తున్నారు. షేన్ వార్న్ హఠాన్మరణం నేపథ్యంలో గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లిన షేన్ వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. ఓ విల్లా గదిలో అచేతనంగా పడి ఉన్న వార్న్‌ను చూసిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వార్న్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. క్వీన్స్‌లాండ్‌లో మృతి చెందిన లెజెండ్ ప్లేయర్ రాడ్ మార్ష్(74)‌కు సంతాపం తెలిపిన కొన్ని గంటలకే వార్న్ మరణించం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

గొప్ప బౌలర్ కాదంటూ..

వార్న్ అకాల మరణం నేపథ్యంలో ఇండియా టుడే హోస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా.. సునీల్ గవాస్కర్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గవాస్కర్ షేన్ వార్న్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సందర్భానుసారం మాట్లాడకుండా అర్థం పర్దం లేని వ్యాఖ్యలు చేశాడు. షేన్ వార్న్ లెజండరీ స్పిన్నరని తాను ఏ మాత్రం అంగీకరించనని, భారత్‌తో అతను దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు.

భారత్‌‌తో విఫలమయ్యాడని..

భారత్‌‌తో విఫలమయ్యాడని..

'డేవిడ్ వార్నర్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్ అంటే నేను అంగీకరించను. అతని కంటే భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీ ధరన్ గొప్ప బౌలర్లు. ఎందుకంటే భారత్‌పై అతని రికార్డులు అంత గొప్పగా లేవు. భారత్‌పై ఆర్దినరీ రికార్డ్స్ ఉన్నాయి. ఒకేసారి నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసాడు. భారత్‌లో అంత గొప్పగా రాణించలేదు కాబట్టే భారత జట్టు అంత సక్సెస్ సాధించలేదు. అందుకే మురళీ ధరణ్ గొప్ప బౌలరని చెబుతున్నా'అని వార్న్ చెప్పుకొచ్చాడు.

గవాస్కర్ బుద్దుందా?

గవాస్కర్ బుద్దుందా?

ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావని మండిపడుతున్నారు. ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలా అని కామెంట్ చేస్తున్నారు. సునీల్ గవాస్కర్.. ఎప్పుడూ ఇలానే మాట్లాడుతాడని, అతని వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.

Story first published: Saturday, March 5, 2022, 21:05 [IST]
Other articles published on Mar 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+