For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీయమ్మ ఒక్క ఫోర్ కొట్టినా అయిపోవ్.. ఛల్.. శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్‌పై పేలుతున్న సెటైర్స్!

Netizens slam Shubman Gill as rain denies him maiden ODI hundred in IND vs WI 3rd ODI

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 98 నాటౌట్) సెంచరీ చేజార్చుకోవడంపై సోషల్ మీడియా వేదికగా ఫన్నీ సెటైర్స్ పేలుతున్నాయి. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ వర్షం కారణంగా అరంగేట్ర సెంచరీ అందుకోలేకపోయాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి గిల్ 98 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటికే భారత ఇన్నింగ్స్‌కు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపేసి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన వెస్టిండీస్ ముందు 257 పరుగుల లక్ష్యాన్ని విధించారు. దాంతో గిల్ అరంగేట్ర సెంచరీ అందుకోలేకపోయాడు.

ఒక్క ఫోర్ కొట్టినా అయిపోవ్..

ఈ క్రమంలోనే గిల్‌ ఇన్నింగ్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గాశారం బాలేకపోతే ఇలానే ఉంటుందని, గిల్ నెత్తిన శని తాండవం చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. గిల్ కూడా అతి జాగ్రత్తకు పోయి సెంచరీ చేజార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 88 బంతుల్లో 88 పరుగులు చేసిన గిల్.. ఆ తర్వాత సెంచరీ చేయాలని ఆచితూచి ఆడాడు. తర్వాతి 10 బంతులకు 10 సింగిల్స్ మాత్రమే తీసాడు. ఇందులో ఒక్క బౌండరీ బాదినా సెంచరీ పూర్తి చేసుకునేవాడని, చేజేతులా బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడని మండిపడుతున్నారు. ఈ విషయంలో గిల్‌ కూడా తనని తాను నిందించుకుంటాడని కామెంట్ చేస్తున్నారు.

ఫ్రస్టేషన్ పీక్స్..

అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్‌ తీరుపై గిల్‌ అసహనం వ్యక్తం చేశాడు. మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాని, స్కూప్‌ షాట్లు ఆడబోయి అనవసరంగా వికెట్లు పారేసుకోవడం బాధను కలిగిస్తోందని తెలిపాడు. ఇప్పటికే నా వన్డే బెస్ట్‌ స్కోరు 68 పరుగులు మాత్రమేనని, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తీరా మ్యాచ్‌లో గిల్ మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. దాంతో అతని ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.

తల్లడిల్లిన సారా టెండూల్కర్..

ఇక గిల్ అద్భుతంగా ఆడినప్పుడల్లా సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ ట్రెండింగ్‌లోకి వస్తుందన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలపై అటు సచిన్ ఫ్యామీలీగానీ.. ఇటు గిల్ కానీ పెదవి విప్పలేదు. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ఫాలో అవుతుండటం, కామెంట్లు చేసుకుంటుండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా సెంచరీ మిస్ చేసుకున్న గిల్.. సచిన్ సరసన చేరాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌ను చూసి సారా టెండూల్కర్ తల్లడిల్లి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సిరీస్ క్లీన్ స్వీప్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది. 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ కింగ్‌ (42), నికోలస్‌ పూరన్‌( 42), హోప్‌(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్‌ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణా చెరో వికెట్‌ పడగొట్టారు.

Story first published: Thursday, July 28, 2022, 10:24 [IST]
Other articles published on Jul 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+