
వామికా కనిపించకుండా..
ఇక వామికాకు సంబంధించి ఇంత వరకు ఒక్క ఫొటో కూడా విరుష్క జోడీ షేర్ చేయలేదు. బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫొటోలను పంచుకున్నారే తప్ప.. పాప ముఖం కనిపించేలా ఉన్న ఒక్క ఫొటోను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పైగా వామికా పుట్టిన సందర్భంగానే పప్పరాజీలు(ఫొటోగ్రాఫర్లకు) తమ కూతురి ప్రైవసీ భంగం కలిగించకుండా ఉండాలని, ఫొటోలు తీయవద్దని ఈ జోడీ విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా పుణే చేరుకున్న ఈ జోడీని పప్పరాజీలు ఫొటోలు తీశారు. వారి కూతురిని టార్గెట్ చేస్తూ కెమెరాలు క్లిక్‌మనిపించారు. అయితే తమ చిన్నారి ఫేస్ కనిపించకుండా అనుష్క గట్టిగా హత్తుకుని కవర్ చేసింది.

సిగ్గు, శరం, బుద్ది లేదు..
అయితే విరుష్క జోడి విజ్ఞప్తి చేసినా.. వారి కూతర్ని ఫొటోలు తీసే ప్రయత్నం చేసిన మీడియా రిపోర్టర్లు, పప్పరాజీలు(ఫొటోగ్రాఫర్ల)పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి కనీస ఇంగిత జ్ఞానం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. 'ఈ పప్పరాజీలకు ఇంగిత జ్ఞానం, ఆత్మగౌరవం లేదు. వారి కూతురు ఫొటోలను తీసి షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసినా.. వీరు వినడం లేదు. వీరి పనులు చాలా దారుణంగా ఉన్నాయి'అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిఒక్కరికి ప్రైవసీ కావాలి, కానీ ఈ మీడియా ఎవరిని పట్టించుకోదని ఇంకొకరు మండిపడ్డారు. వారి కూతురు ఫొటోలు తీయవద్దని చెప్పినా తీస్తున్నందుకు సిగ్గుండాలని మరొకరు ఘాటుగా విమర్శించారు. వారి ఫొటోలు తీసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ.. మళ్లీ వారు చెప్పిన చిన్న రిక్వెస్ట్‌ను పట్టించుకోరా? అని ఇంకొకరు ప్రశ్నించారు.

ప్రేమ, పెళ్లి, కూతరు..
బాలీవుడ్ నటి అనుష్క శర్మను విరాట్ కోహ్లీ తొలిసారి ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో కలుసుకున్నాడు. ఆ పరిచయం కాస్త పరిణయంగా మారి.. ఐదారేళ్లు లవ్‌లో మునిగి తేలారు. చివరకు 2017 డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక లాక్‌డౌన్ సందర్భంగా 5-6 నెలలు ఇంటికే పరిమితమైన విరుష్క.. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించింది. అనుష్క ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. జనవరి 11న పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరి పేర్లు కలిసేలా ఆ చిన్నారికి వామికా అని పేరు పెట్టుకున్నారు. వామికా అంటే దుర్గాదేవి అని అర్థం.


Click it and Unblock the Notifications












