Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hanuma Vihari ఏం పాపం చేశాడు.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!

 Netizens slam BCCI selectors for axing Hanuma Vihari from New Zealand Test series
IND Vs NZ : Hanuma Vihari పై వివక్ష ? కరుణ్‌ నాయర్‌ కి జరిగినట్టే..! || Oneindia Telugu

ముంబై: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. నిలకడగా రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ‌లతో పాటు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చింది. దాంతో అంజిక్యా రహానే కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. చతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

హనుమ విహారికి నోచాన్స్..

హనుమ విహారికి నోచాన్స్..

సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో తెలుగు క్రికెటర్ కేఎస్‌ భరత్‌‌తో పాటు జయంత్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు అవకాశం దక్కింది. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన శుభ్‌మన్‌ గిల్‌ కూడా తుది జట్టులోకి వచ్చాడు. అయితే తెలుగు క్రికెటర్ హనుమ విహారిని పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమ విహారి పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడుతున్నారు.

ఎందుకీ వివక్ష..?

ఎందుకీ వివక్ష..?

గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో హనుమ విహారి అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను పరాజయం నుంచి తప్పించాడు. అలాంటి క్లాస్‌ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్‌లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్‌ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్‌ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా కరుణ్‌ నాయర్‌ విషయంలో జరిగిన వివక్ష హనుమ విహారికి జరుగుతుందని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే విహారి కనుమరుగవుతాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మూడు టీ20ల సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

 భారత టెస్టు జట్టు:

భారత టెస్టు జట్టు:

అజింక్య రహానే (కెప్టెన్), చేటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత టీ20 జట్టు:

భారత టీ20 జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌ (వైస్ కెప్టెన్), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్ పంత్‌, ఇషాన్‌ కిషన్, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చహల్‌, ఆర్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌.

Story first published: Friday, November 12, 2021, 20:37 [IST]
Other articles published on Nov 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+