Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి స్కూప్ షాట్‌రా మామ! (వీడియో)

హైదరాబాద్: క్రికెట్‌లో స్కూప్ షాట్, స్విచ్ హిట్, స్క్వేర్ కట్, అప్పర్ కట్, రివర్స్ స్వీప్, పుల్ షాట్, హెలికాప్టర్, దీల్ స్కూప్ షాట్లు ఎన్నోసార్లు చూశాం. ఆయా షాట్లను ఒక్కో ఆటగాడు పరిచయం చేస్తే.. మరికొందరు వాటిని ఆడటంలో ఆరి తేరారు. అప్పర్ కట్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టింది పేరు అయితే.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హెలీకాప్టర్ షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు.

శ్రీలంక దిగ్గజ బ్యాటర్ దిల్షాన్ దిల్ స్కూప్ షాట్ ఆడితే.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ వైవిధ్యమైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ షాట్లన్నీ కలగలిపి టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగుతున్నాడు. 360 డిగ్రీస్ ప్లేయర్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు.

Netizens Shocked Batters Unique Scoop Shot From Behind The Stumps goes viral

కానీ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బ్యాటర్ ఆడిన షాట్.. వీటన్నిటికీ తాతాలా ఉంది. రివర్స్ స్కూప్ షాట్‌నే తలదన్నేలా ఉంది. ఏకంగా వికెట్ల వెనుకాకు పరుగెత్తి ఆడిన ఈ స్కూప్ షాట్ అభిమానులను అలరిస్తోంది. సోషల్ మీడియా రీల్స్ కోసం ఆడిన షాటో లేక.. ఏదైన టోర్నీలో ఆడాడో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మిస్టర్ 1080 షాట్ అని ఒకరంటే.. ఈ ఒక్క షాట్‌తో క్రికెట్‌లో ఉన్న అన్నీ షాట్లను గుర్తు చేసుకునేలా చేశాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది క్రికెట్ రూల్స్‌కు విరుద్దమని కామెంట్ చేస్తున్నారు.

వెంటనే అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు. ఏదీ ఏమైనా ఈ షాట్ పుణ్యమా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. ఇక లోకల్ టోర్నీల్లో ఇలాంటి వినూత్న సంఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద తన సర్కస్ ఫీట్లతో పట్టిన క్యాచ్ తీవ్ర చర్చనీయాంశమైంది.

బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో చేతులకు తాకి బంతి గాల్లోకి లేవగా సదరు ఫీల్డర్ బౌండరీ లైన్ క్రాస్ చేశాడు. ఆ వెంటనే బంతిని గాల్లోకి ఎగిరి మైదానంలోకి తన్నగా మరో ఫీల్డర్ పట్టాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

Story first published: Thursday, June 29, 2023, 19:57 [IST]
Other articles published on Jun 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+