Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బేబీ బంప్‌తో సాక్షి.. రెండోసారి తండ్రి కాబోతున్న ధోనీ! (వీడియో)

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండోసారి తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ధోనీ సతీమణి సాక్షి సింగ్ గర్భం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది. 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా జీవాకు జన్మనిచ్చిన ధోనీ-సాక్షి.. మళ్లీ రెండో బిడ్డకు ప్లాన్ చేయలేదు.

ఈ విషయంపై ఎక్కడా నోరు విప్పలేదు. కానీ తాజాగా సాక్షి సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో ఆమె గర్భవతి అనే సందేహాలకు తావిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, నటుడు ఆయుష్ శర్మ ఇచ్చిన రంజాన్ దావత్‌కు సాక్షి సింగ్ కూతురు జీవాతో కలిసి హాజరైంది. పప్పరాజీలు ఆమెను ఫొటోకు ఫోజివ్వాలని కోరగా.. పట్టించుకోకుండా తన కడుపును కవర్ చేసుకుంటూ వెళ్లిపోయింది.

ms dhoni wife sakshi baby bump

బేబీ బంప్‌తో కనిపించిన సాక్షి సింగ్ అనార్కలి సూట్‌లో మెరిసింది. తన కడుపు దుపట్టాతో కవర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. సాక్షి గర్భవతి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కడుపును కవర్ చేసుకోవడం.. పప్పరాజీలపై ఆగ్రహం వ్యక్తం చూస్తుంటే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం అర్థమవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఖచ్చితంగా ఆమె ప్రెగ్నెంట్ అని మరో నెటిజన్ స్పందించాడు.

ఎప్పుడైనా పప్పరాజీలకు ఫోజులిచ్చే సాక్షి ఈ సారి వారిని కసురుకోవడం ప్రెగ్నెంట్ అనే వార్తలకు బలం చేకూరుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా కూడా సాక్షి గర్భవతి అనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తర్వాత స్పష్టమైంది. ఇప్పటి వరకు అయితే ధోనీ-సాక్షిలు ప్రెగ్నెన్సీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పెళ్లి అయినప్పటి నుంచి ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు హాజరై చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు తెలిపిన సాక్షి.. గత రెండేళ్లుగా బిజినెస్ వ్యవహారాలతో పాటు జీవా స్టడీస్‌పై ఫోకస్ పెట్టడంతో మ్యాచ్‌లకు రావడం లేదు. దాంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌తో బిజీగా ఉన్న ధోనీ.. సూపర్ కెప్టెన్సీతో పాటు కీపింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.

ధోనీ సారథ్యంలోని చెన్నై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసిన ధోనీ సేన పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ధోనీ చివరి సీజన్‌గా భావిస్తుండటంతో అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ తరలివస్తున్నారు. ఎక్కడా జరిగినా.. మైదానాలన్నీ పసుపు మయం అవుతున్నాయి.

Story first published: Monday, April 24, 2023, 17:24 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+