For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కోహ్లీ అత్యుత్సాహం.. పంత్ వద్దన్నా వినకుండా రివ్యూ తీసుకున్న భారత కెప్టెన్! (వీడియో)

Netizens reacts to Virat Kohli burning Indias second review despite Pants warning
Ind vs Eng 2021: India Fans Not Impressed As Team Lost Two Reviews Despite Pant's Advice

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సహచర ఆటగాళ్లు చెప్పినా వినకుండా రివ్యూ తీసుకొని వృథా చేశాడు. దాంతో భారత కెప్టెన్‌పై సోషల్ మీడియా వేదికగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఇలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్బంగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వద్దని వారిస్తున్నా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీకి భంగపాటు ఎదురైంది. ఇటీవల కాలంలో రిషభ్ పంత్‌ చాలా వరకూ డీఆర్‌ఎస్‌ కోరడంలో కెప్టెన్ కోహ్లీకి సాయపడుతున్నాడు. కానీ.. లార్డ్స్‌లో పంత్ అభిప్రాయాన్ని పక్కనపెట్టిన కోహ్లీ.. సిరాజ్‌‌పై గుడ్డి నమ్మకంతో డీఆర్‌ఎస్ తీసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్.. నాలుగో బంతిని లైన్ లెంగ్త్‌తో వికెట్లపైకి విసిరాడు. దాంతో.. ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు జో రూట్ ప్రయత్నించగా.. కొద్దిగా టర్న్ అయిన బంతి బ్యాట్‌కి దొరకకుండా ఫ్యాడ్‌ని తాకుతూ వెళ్లింది. దాంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

వద్దని వారించినా..

అయితే.. బంతి కచ్చితంగా వికెట్లను తాకేలా కనిపించిందని మహమ్మద్ సిరాజ్ చెప్పడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోవాలని భావించాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, సిరాజ్, కోహ్లీ మధ్య చిన్నపాటి డిస్కషన్ కూడా జరిగింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం సిరాజ్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. బంతి లెగ్ స్టంప్‌కు బయటగా వెళ్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీతో వారించాడు. రివ్యూ వద్దని సూచించాడు. కోహ్లీ కూడా తీసుకోవాలా? వద్దా? అని సంశయించాడు. పంత్ నెత్తినోరు కొట్టుకుంటూ చెప్తుండటంతో నవ్వూతూ చివరి క్షణంలో రివ్యూ‌కు సైగా చేశాడు. కానీ.. రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో.. రిషభ్ పంత్ వద్దని బతిమిలాడినా రివ్యూ కోరిన విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీఆర్ఎస్ = డోంట్ రివ్యూ సిరాజ్

డీఆర్ఎస్ = డోంట్ రివ్యూ సిరాజ్

ఇలా సిరాజ్‌ను నమ్మి.. అతని కోరిక మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సార్లు డీఆర్ఎస్( డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరాడు. అయితే.. రెండు సార్లు అది ఫెయిల్ అయ్యింది. రెండు సార్లు సిరాజ్ కారణంగా డీఆర్ఎస్ కోల్పోవడంతో.. మరో ఇండియన్ క్రికెటర్ వసీమ్ జాఫర్.. సిరాజ్ ని టీజ్ చేశాడు. సిరాజ్ ని ఆటపట్టిస్తూ.. డీఆర్ఎస్ కి కొత్త అర్థం చెప్పాడు. డీఆర్ఎస్ అంటే.. " డోంట్ రివ్యూ సిరాజ్" అంటూ ట్వీట్ చేశాడు. దాని పక్కన ఓ ఎమోజీని కూడా పెట్టాడు. అయితే.. వసీం జాఫర్ చేసిన ట్వీట్.. ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే, నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సిరాజ్ పై సెటైర్లు వేస్తున్నారు. పంత్ నోరు మొత్తుకుని వద్దని చెబుతున్నా.. నీ ఆతృత వల్ల టీమిండియా రెండు అమూల్యమైన రివ్యూలు కోల్పయిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఫస్ట్ రెండు టెస్ట్ ల్లో ఇప్పటికే సిరాజ్ వల్ల విరాట్ కోహ్లీ ఐదు సార్లు రివ్యూ తీసుకున్నాడు. ఐదు సార్లు కూడా విఫలమయ్యాడు.

పంత్ కన్నా సిరాజ్ ఎక్కువ?

పంత్ కన్నా సిరాజ్ ఎక్కువ?

అలాగే, విరాట్ కోహ్లీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు సంప్రదించకుండా.. సిరాజ్ అత్యుత్సాహన్ని పరిగణనలోకి తీసుకోని రివ్యూలు తీసుకోవడం ఏంటని కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. రివ్యూ తీసుకోవడానికి కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివిధరకాల మీమ్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. అనంతరం ఇంగ్ండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్‌) ఉన్నారు.

Story first published: Saturday, August 14, 2021, 12:03 [IST]
Other articles published on Aug 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+