‘బ్రేకింగ్ న్యూస్.. ద్రవిడ్‌పై చేయిచేసుకున్న విరాట్ కోహ్లీ’.. టీమిండియా ట్రెయినింగ్ సెషన్‌పై పేలుతున్న సెటైర్

న్యూఢిల్లీ: ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తమ సన్నాహకాలను షురూ చేసింది. ఒక్క రోజు క్వారంటైన్‌ను ముగించుకొని జోహన్నస్ బర్గ్‌లో వామప్ సెషన్ ప్రారంభించింది. ఈ సెషన్ టీమిండియా ఆటగాళ్లంతా జాలీగా ఫుట్ వాలీ మ్యాచ్ ఆడారు. ఈ సెషన్‌ను టీమిండియా స్ట్రెంత్ కండిషన్ కోచ్ సోహమ్ దేశాయ్ పర్యవేక్షించాడు. అతను చెప్పిన రూల్స్ ప్రకారమే టీమిండియా ఆటగాళ్లంతా రెండుగా విడిపోయి ఈ మ్యాచ్ ఆడారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ గేమ్‌లో పాల్గొన్నాడు. ఇక ఈ వీడియో బీసీసీఐ ట్విటర్ వేదికగా పంచుకుంది. జోహన్నెస్ బర్గ్‌లోని ఫస్ట్ ట్రైనింగ్ సెషన్‌కు ముందు టీమిండియా తమ బ్యాటరీలను రిచార్జ్ చేసుకుంటుంది. ఫూట్ వ్యాలీ ఆడుతుందనే క్యాప్షన్ ఇచ్చింది.
జాలీగా ఫుట్ వ్యాలీ..
ఇక ఈ గేమ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు భారత ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఈ గేమ్ ఆడారు. ఒక జట్టుకు అశ్విన్ సారథ్యం వహించగా, మరో జట్టుకు ద్రవిడ్ నాయకత్వం వహించాడు. ఈ వీడియోలో అశ్విన్, పుజారా సీరియస్‌గా గొడవ కూడా పడ్డారు. అదే విధంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫుట్‌బాల్ స్కిల్స్‌ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపడ్డాడు. ఈ ఇద్దరు హై ఫై కూడా ఇచ్చుకున్నారు. అయితే ద్రవిడ్-కోహ్లీ హై ఫై ఇచ్చుకోవడంపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ద్రవిడ్‌పై చేయిచేసుకున్న కోహ్లీ..
ఇక ప్రస్తుతం భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి ఈ హై ఫై ఫొటోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. 'బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ ద్రవిడ్‌పై చేయిచేసుకున్న కోహ్లీ.. ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ'అని ఒకరంటే.. ద్రవిడ్‌కు కోహ్లీ కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ మరొకరు సెటైరిక్‌గా కామెంట్ చేశారు. ఇక ఈ హై ఫై చిత్రం చూసి కొందరికి ఎక్కడో కాలుతున్నట్లుందని ఇంకొకరు ట్వీట్ చేశారు. అంతేకాకుండా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా రావడంతో విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ కూడా నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
కాలం మారిందంతే..
ద్రవిడ్ బెత్తం పట్టుకొని కోహ్లీని ఆడిస్తాడనేది ఊహాని, కానీ రియాల్టీ మాత్రం ఇలా హై ఫైలతో ఎంజాయ్ చేస్తారని విమర్శకులకు చురకలంటిస్తున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత భారత అభిమానులు సంతోషంతో ఆనంద భాష్పాలు కారుస్తారని, ద్రవిడ్-కోహ్లీ శకం మొదలైందని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్‌సీబీకి కోహ్లీ-ద్రవిడ్ కలిసి ఆడారని కూడా గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. టైమ్ మారింది కానీ ఇద్దరి బంధం మాత్రం అదేననే డైలాగ్స్ కొడుతున్నారు. ప్రస్తుతం ఈ హై ఫై ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ కెప్టెన్సీ మార్పు వివాదంలోకి ద్రవిడ్‌ను అనవసరంగా లాగారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
వైస్ కెప్టెన్‌గా రాహుల్..
ఈ సిరీస్‌కు తొడకండరాల గాయంతో ఆఖరి నిమిషంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతని స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. ఇక ఈ సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును సౌతాఫ్రికాకు పంపించింది. డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications