For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: పాపం విహారి.. మా తెలుగోడిని ఆగం చేస్తున్నారు కదరా? రహానే‌కు చాన్సివ్వడంపై ఫ్యాన్స్ ఫైర్

Netizens reacts as Ajinkya Rahane makes the cut ahead of Vihari and Iyer in the first Test against South Africa

న్యూఢిల్లీ: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా.. అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని అవకాశాలిస్తారని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగాడు. దాంతో ఐదుగురు బ్యాట్స్‌మన్‌ను మాత్రమే ఆడించాల్సి వచ్చింది. అయితే గతేడాదిగా విఫలమవుతున్న అజింక్యా రహానే‌కు చోటు దక్కదని అంతా భావించారు.

12 టెస్ట్‌ల్లో 411 రన్సే..

ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టెస్ట్‌లు ఆడిన రహానే.. 19.57 సగటుతో 411 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్ ఆరంభించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ బాది తన సత్తా ఏంటో చాటాడు. దాంతో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దొరుకుతుందని అంతా భావించారు. అంతేకాకుండా భారత్-ఎ జట్టు తరఫున ఇప్పటికే సౌతాఫ్రికా పర్యటనలో అనాధికార టెస్ట్ సిరీస్ ఆడిన హనుమ విహారి.. మంచి ప్రదర్శన కనబర్చాడు. దాంతో రహానేకు బదులు విహారినైనా తీసుకుంటారని అనుకున్నారు.

విహారికి అన్యాయం..

కానీ ద్రవిడ్ పర్యవేక్షణలోని టీమిండియా‌ మేనేజ్‌మెంట్.. రహానే అనుభవానికే ఓటేస్తూ అతనికి మరో అవకాశం ఇచ్చింది. దాంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. శ్రేయస్ అయ్యర్‌తో పాటు హనుమ విహారికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. 'నో అయ్యర్, నో విహారి.. ఐదుగురి బ్యాటర్లతో టీమింయా చాలా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకుంది'అని ఆకాశ్ చోప్రా సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగాల్సిందని చోప్రా పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో రహానే సెంచరీ చేస్తే..

'విహారి స్థానంలో శార్ధూల్ ఠాకూర్‌ను తీసుకోవడంపై ఎవరూ అభ్యంతరం చెప్పరూ.. కానీ విహారికి బదులు రహానేను ఆడించడాన్ని ప్రతీ ఒక్కరు నిలదీస్తారు. గత ఐదేళ్లుగా అతను దారుణంగా విఫలమవుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలి. లేకుంటే అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే'అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో గనుక అజింక్యా రహానే సెంచరీ చేస్తే మరో రెండేళ్లు పాటు జట్టులో అతని చోటుకు డోకా ఉండదని, కానీ హనుమ విహారి వంటి ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మరో ట్విటర్ యూజర్ అసహనం వ్యక్తం చేశాడు. విహారికి తీరని అన్యాయం జరుగుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవకాశాలివ్వకుండా..

ఇన్నాళ్లు ద్రవిడ్‌కు సెన్స్ ఉందనుకున్నాని, కానీ విహారిని తప్పించి రహానేను ఆడించడంతో అతను కూడా సాధారణ వ్యక్తేనని మరో అభిమాని ఘాటుగా విమర్శించాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో బాధపడుతున్నా.. వేగంతో దూసుకొచ్చిన బంతులను శరీరానికి తగిలించుకొని జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడని, అలాంటి వ్యక్తికి అవకాశాలు ఇవ్వడంలేదని మండిపడుతున్నారు. చాలా దారుణమని, విహారికి సరైన అవకాశాలు ఇవ్వకుండానే అతని కెరీర్‌కు ముగింపు పలుకుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Sunday, December 26, 2021, 15:25 [IST]
Other articles published on Dec 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+