19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..
19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పృథ్వీషా.. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఒక ఓవర్‌లో 4, 4, 4, 6, 6, 4 ఆరు బౌండరీలు బాది 28 పరుగులు పిండుకున్నాడు. సెంచరీ అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. జెర్సీపై తన పేరును చూపిస్తూ.. పృథ్వీ షా అంటే ఇదని తెలియజేశాడు. సెలెక్టర్లను ఉద్దేశించే పృథ్వీ షా ఈ సంబరాలు చేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పృథ్వీ షా విధ్వంసంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్(42) రాణించాడు.
ఆస్ట్రేలియా పర్యటన వైఫల్యంతో..
2020 ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన పృథ్వీ షా మళ్లీ టీమిండియా పిలుపును అందుకోలేదు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సెలెక్టర్లు పృథ్వీషాను ఎంపికచేయలేదు. తనను ఎంపిక చేయకపోవడంపై పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సెలెక్టర్లను ఉద్దేశించి నమ్మించి మోసం చేశారని ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.
8 కిలోల బరువు తగ్గినా...
అనంతరం మిడ్‌డే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అసహనాన్ని వెళ్లగక్కాడు. 'దేశవాళీ క్రికెట్‌లో బాగానే రన్స్ చేస్తున్నా. కానీ.. నాకు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం ఇవ్వకపోడం చాలా నిరాశకు గురిచేసింది. అయినా ఏం బాధపడటం లేదు.. ఎప్పుడైతే భారత సెలెక్టర్లు నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని భావిస్తారో .. అప్పుడే నాకు అవకాశం ఇస్తారనుకుంటున్నా. నేను కూడా ఎప్పుడు ఛాన్స్ దక్కినా.. అది భారత్ జట్టు లేదా భారత-ఎ జట్టు లేదా ఏ టీమ్ అయినా సత్తాచాటేందుకు ప్రయత్నిస్తా.
ఇష్టమైన స్వీట్స్ తినడం లేదు...
నేను ఇప్పటికే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాను. నా బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు, అయితే ఫిట్‌నెస్ లేదని నన్ను పక్కనబెడుతున్నారు. అందుకే బరువు తగ్గడంపై పూర్తి ఫోకస్ పెట్టాను. ఐపీఎల్ 2022 తర్వాత ఏడు నుంచి 8 కిలోల వరకూ బరువు తగ్గాను. జిమ్‌లో చాలా సమయం గడుపుతున్నాను.
రన్నింగ్ చేస్తున్నా. నాకెంతో ఇష్టమైన స్వీట్స్ తినడం కూడా మానేశాను. కూల్ డ్రింక్స్ కూడా తాగడం లేదు. చైనీస్ ఫుడ్‌ని కూడా నా మెనూ నుంచి తీసేశాను. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో నా పర్ఫామెన్స్, టీమ్‌కి సెలక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












