Vijay Deverakonda:కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుంది.. నీకు అంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్!

హైదరాబాద్: ఆసియాకప్ 2022లో భాగంగా భారత్ X పాకిస్థాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌కు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన అతని లైగర్ చిత్రం ప్రమోషన్స్ కోసం విజయ్ ఈ మ్యాచ్‌కు హాజరై సందడి చేశాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొని రచ్చ చేశాడు. స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సరదాగా చిట్ చాట్ చేశాడు. ఇక మ్యాచ్ జరుగుతుండగా.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌లో కామెంటేటర్లతో ముచ్చటించాడు. తెలుగు వ్యాఖ్యాతలకు దుబాయ్‌లోని పరిస్థితిని వివరించాడు.
విరాట్ బయోపిక్ చేస్తా..
కామెంటేటర్లు కళ్యాణ్, ఎమ్మెస్కే ప్రసాద్ అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ సమాధానాలు ఇచ్చాడు. కిక్కిరిసిన మైదానంలో మ్యాచ్ చూస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుందని చెప్పిన రౌడీ హీరో.. జాతీయ గీతం వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపాడు. ఏదైన క్రికెటర్ బయోపిక్‌లో నటించాలని ఉందా? అని కళ్యాణ్ అడగ్గా.. విరాట్ అన్న బయోపిక్ చేయాలనుందని చెప్పాడు. కోహ్లీ అంటే తనకు ఇష్టమని, అతని యాటిట్యూడ్ అంటే పడి చస్తానని తెలిపాడు. రణ్‌వీర్ నటించిన కపిల్ బయోపిక్ 83 మూవీలో కృష్ణమాచారి పాత్ర కోసం తనను అడిగారని, కానీ తనకు కుదరలేదని చెప్పాడు.
నీకు అంత సీన్ లేదు..
ఇక విరాట్ బయోపిక్ చేయాలనుందని విజయ్ తన మనసులోని మాటను బయటపెట్టడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. తెలుగు అభిమానులు విజయ్ సరైనవాడని సంతోషం వ్యక్తం చేయగా.. బాలీవుడ్, కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందించారు. కోహ్లీ బయోపిక్‌లో నటించే సీన్ విజయ్‌కు లేదని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ బయోపిక్‌లో అతనే నటిస్తాడని, అతని సతీమణి మంచి నటితో పాటు పెద్ద ప్రొడ్యూసర్ అనే విషయం మరిచిపోవద్దని గుర్తు చేస్తున్నారు.
లైగర్ ఫ్లాఫ్ నుంచి గట్టెక్కు..
విజయ్ కంటే విరాట్ కోహ్లీనే మంచి నటుడని, నటనలో అతనికే అనుభవం ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ముందుగా లైగర్ పరాజయం నుంచి తేరుకునేందుకు ప్రయత్నించని సలహా ఇస్తున్నారు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ.. తొలి రోజు నుంచే ఫ్లాఫ్ టాక్‌ను మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications