Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: రాహుల్ త్రిపాఠిది టూరిస్ట్ వీసానా?.. రుతురాజ్ లేడు మ్యాచ్ చూడమ్! ఫ్యాన్స్ ఫైర్!

 Netizens not impressed with Rahul Tripathi and Ruturaj Gaikwad being benched in 1st ODI vs Zimbabwe

హరారే: టీమిండియా యువ బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్‌లకు మరోసారి నిరాశే ఎదురైంది. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఇద్దరికి చోటు దక్కలేదు. రాహుల్ త్రిపాఠికి బదులు ఇషాన్ కిషన్‌ను అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, దీపక్ చాహర్‌ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ అవకాశం అందుకోలేకపోయారు. అయితే రాహుల్ త్రిపాఠి, రుతురాజ్‌ గైక్వాడ్‌లను జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాపం త్రిపాఠి..

రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేసి ఇలానే ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదని, రుతురాజ్‌కు సైతం చాలా రోజులుగా తుది జట్టులోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాహుల్ త్రిపాఠికి ఈ పర్యటనలో అవకాశం ఇవ్వాలని, ఇషాన్ కిషన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలిచ్చారని కామెంట్ చేస్తున్నారు. ఈ ప్లేయింగ్ ఎలెవన్ చూసిన తర్వాత మ్యాచ్ చూడటం దండుగ అనిపిస్తుందని, టీవీలు ఆఫ్ చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీపక్ చాహర్ రావడంపై..

ఇక దీపక్ చాహర్ జట్టులోకి రావడం బాగుందని కామెంట్ చేస్తున్న అభిమానులు త్రిపాఠిని మిస్సవుతున్నామని పేర్కొంటున్నారు. రాహుల్ త్రిపాఠికి టూరిస్ట్ వీసా ఉందా? అతన్ని జింబాబ్వే పర్యటనకు ఎందుకు తీసుకెళ్లారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. జట్టు మొత్తం బాగానే ఉందని, ఒక్క త్రిపాఠికి అవకాశం కల్పిస్తే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రుతురాజ్ మరో సంజూ శాంసన్‌లా మారనున్నాడని, అతనికి అవకాశాలు ఇవ్వలేడం లేదని కామెంట్ చేస్తున్నారు.

దీపక్ చాహర్ తీన్మార్..

సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. మూడు వికెట్లతో సత్తా చాటడంతో జింబాబ్వే 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఓపెనర్లు ఇన్నోసెండ్ కియా(4), మారుమని(8), వెస్లీ మధెవెరె(5)లను చాహర్ పెవిలియన్ చేర్చాడు. సిరాజ్, ప్రసిధ్ చెరొక వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, August 18, 2022, 14:51 [IST]
Other articles published on Aug 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+