PAK Vs WI: ఇలాంటి ఫీట్లు మీకే సొంతంరా.. అయ్యా! పాక్ ఆటగాళ్ల క్యాచ్ డ్రాప్‌పై పేలుతున్న సెటైర్లు!

కరాచీ: చాలా కాలం తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం చివరిదైన మూడో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చేసిన ఘోర తప్పిదం ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మిస్టేక్‌పై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేల్చుతున్నారు.
పాకిస్థాన్ ఆటగాళ్లకే ఇలాంటి పనులు సాధ్యమవుతాయని ఎగతాళి చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత బద్దకస్తులు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్లు పాక్ ఆటగాళ్లేనని విమర్శిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఈ ఘటనపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..
వెస్టిండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ హస్నేన్‌లు సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశారు. నువ్వు పట్టంటే..నవ్వు పట్టంటూ.. ఇద్దరి పొత్తుల బంతిని విడిచిపెట్టారు. దాంతో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. క్యాచ్ అనంతరం ఒకరిపై మరొకరు నిందలేసుకున్నారు. తప్పు నీదంటే నీదని వాదులాడుకున్నారు.
అయితే పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలా క్యాచ్‌లు చేజార్చడం ఇదే తొలిసారి కాదు. 13 ఏళ్ల కింద 2008లో కూడా అచ్చం ఇదే తరహాలో అప్పటి ఆటగాళ్లు షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లు ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో ఇలానే సునాయస క్యాచ్‌ను విడిచిపెట్టారు. అయితే అప్పుడు.. ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీసే కావడం విశేషం.

మాలిక్, అజ్మల్ 2.O వర్షన్..
దాంతో నాటి ఘటనను గుర్తు చేస్తూ అభిమానులు.. పాక్ ఆటగాళ్లపై సెటైర్లు పేల్చుతున్నారు. మాలిక్, అజ్మల్ క్యాచ్‌ను రీ క్రియేట్ చేశారని, ఇది మాలిక్, అజ్మల్‌కు 2.O వర్షన్ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. 'ఏది ఏమైనా ఇలాంటి ఫీట్లు పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు'అని ఒకరంటే.. 'హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.'అని మరొకరు కామెంట్ చేశారు.
'న్యూ అజ్మల్, మాలిక్.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అయితే ఈ క్యాచ్ డ్రాప్ ఫలితంపై ప్రభావం చూపకపోవడంతో ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ హస్నేన్‌లు ఊపిరి పీల్చుకున్నారు.
పాక్ రికార్డు చేజింగ్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. పూరన్ (64), బ్రూక్స్ (49), కింగ్ (43) రాణించారు. ఆ తర్వాత పాక్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది.రిజ్వాన్ (87), బాబర్ ఆజమ్ (79) చెలరేగగా.. మరోవైపు ఈ ఫార్మాట్‌లో తమ అత్యధిక ఛేదన (208)తో పాక్ రికార్డు నెలకొల్పింది. అలాగే ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో ఎక్కువ పరుగులు (2036) చేసిన బ్యాటర్‌గా రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు.

వన్డే సిరీస్ వాయిదా..
వెస్టిండీస్ జట్టులో కరోనా కేసులు రావడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ను వాయిదా వేసారి. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సిరీస్‌ను నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఇప్పటికే ముగ్గురికి కరోనా సోకగా, తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో విండీస్ బృందం లో మరో ముగ్గురు ఆటగాళ్లసహా ఐదుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. షాయ్ హోప్, అకిల హుస్సేన్, జస్టిన్ గ్రీవ్స్‌తోపాటు సహాయ సిబ్బంది ఎస్ట్‌విక్, ఫిజీషియన్ అక్షయ్ మాన్‌సింగ్ వైరస్ బారినపడ్డట్టు పీసీబీ పేర్కొంది.
మొత్తం ఆరుగురు కరీబియన్ ప్లేయర్లకు కరోనా సోకడంతో గురువారం జరగాల్సిన ఆఖరి, మూడో టీ20పై కొంత సందిగ్ధత నెలకొన్నా.. అందరినీ పరీక్షించిన తర్వాత ఆడేవిధంగా విండీ స్ బోర్డును పీసీబీ ఒప్పించగలిగింది. ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వన్డే సిరీస్‌ను వాయిదా వేయాలని ఇరు బోర్డులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications