ఎవడ్రా అలా అన్నది..
తొలి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి విజయాల ఖాతా తెరిచింది. అయితే ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ రాలేదు. వ్యక్తిగత కారణాలో మరేదో తెలియదు కానీ ఆమె హాజరు కాలేదు.
మెగా వేలంలో సరైన టీమ్ తీసుకోలేదని ఆమెపై ఓ వర్గం అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. కావ్య గైర్హాజరీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ఆమెది ఐరన్ లెగ్ అని, మ్యాచ్‌కు రావద్దని ప్రచారం చేశారు. ప్రతీ మ్యాచ్‌కు ముందు కావ్య పాప స్టేడియానికి రావద్దని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు.
కావ్య పాప నవ్వింది..
అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కావ్య మారన్ హాజరైంది. గ్యాలరీలో తన హవాభావాలతో అభిమానులను కట్టిపడేసింది. ఆమె నవ్వులు.. విచారంగా ఉండట్టాన్ని కెమెరామెన్ పదే పదే చూపించాడు. సన్‌రైజర్స్ విజయంతో ఆమె ఎగిరి గంతేసింది. ఆమె ముఖం చిరునవ్వులు చిందించాయి. దాంతో కావ్య యాంటీ ఫ్యాన్స్‌పై ఆమె సపోర్టర్స్ ఎదురు దాడికి దిగారు. ఎవడ్రా కావ్య పాప వస్తే మ్యాచ్ గెలవదన్నదని ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు. మా కావ్య పాప మ్యాచ్‌కు వచ్చింది.. విజయంతో నవ్విందని కామెంట్ చేస్తున్నారు.
మీరు మారిపోయారు సర్..
సన్ రైజర్స్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కూడా నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ సెల్యూట్ చేసే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది, తగ్గేదేలే.. అట్లుంటది మనతోనే అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్న మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక కావ్య పాప ముఖంలోని చిరునవ్వులు.. గ్లో తమకు చాలా సంతోషాన్నిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ లోటు ఉందని, అదొక్కటి తీరితే ఆ జట్టుకు తిరుగుండదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
త్రిపాఠి విధ్వంసం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, నటరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ త్రిపాఠి (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా, మార్క్‌రమ్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు.


Click it and Unblock the Notifications

